Raviteja: తన ఫేవరెట్ డైరెక్టర్స్‌తో రవితేజ ధమాకా ఇంటర్వ్యూ..!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసేలా చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌తో దుమ్ములేపుతోంది. దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కించిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యింది.

Raviteja: తన ఫేవరెట్ డైరెక్టర్స్‌తో రవితేజ ధమాకా ఇంటర్వ్యూ..!

Raviteja Interview With His Favourite Directors Pic Goes Viral

Raviteja: మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసేలా చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌తో దుమ్ములేపుతోంది. దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కించిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాలో రవితేజ డ్యుయెల్ రోల్‌లో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

Dhamaka : మరోసారి రవితేజ డ్యూయల్ రోల్.. ఈ సారన్నా వర్కౌట్ అవుతుందా??

కాగా, ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ వరుస ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తాజాగా హీరో రవితేజ ఏకంగా ముగ్గురు బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్‌కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. ఈ ముగ్గురు డైరెక్టర్స్ కూడా రవితేజతో వర్క్ చేసినవారే. అంతేగాక, వారు రవితేజకు అదిరిపోయే సాలిడ్ హిట్ సినిమాలను అందించారు.

Dhamaka: ధమాకాలో ముద్దులు అందుకే లేవంటోన్న రవితేజ..?

ఇలా తనకు బ్లాక్‌బస్టర్స్ అందించిన డైరెక్టర్స్‌తో ఇంటర్వ్యూ చేయడం తనకు సంతోషంగా ఉందని.. ఈ ధమాకేదార్ ఇంటర్వ్యూను రేపు రిలీజ్ చేయబోతున్నట్లు రవితేజ తన ట్విట్టర్ అకౌంట్‌లో తెలిపాడు. ఇక ధమాకా సినిమాలో రవితేజ సరసన అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.