Reserve Bank: కేంద్రానికి రూ. 99వేల కోట్లు.. ఆర్‌బీఐ ఆమోదం

Reserve Bank: కేంద్రానికి రూ. 99వేల కోట్లు.. ఆర్‌బీఐ ఆమోదం

Reserve Bank

RBI Board: 99,122 కోట్ల రూపాయల మిగులు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలన్న ప్రతిపాదనకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం ఆమోదం తెలిపింది. 2021 మార్చి 31 తో ముగిసే తొమ్మిది నెలల అకౌంటింగ్ కాలానికి మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వానికి బదిలీ చేస్తామని సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. RBI గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగిన సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ల సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగింది.

మార్చి 31, 2021తో ముగిసిన తొమ్మిది నెలల అకౌంటింగ్ కాలానికి ప్రభుత్వానికి మిగులుగా ఉన్న రూ.99వేల 122 కోట్లను బదిలీ చేయడానికి RBI బోర్డు ఆమోదం తెలిపింది. ఆర్‌బీఐ కేంద్ర డైరెక్టర్ల 589వ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ప్రపంచ మరియు దేశీయ సవాళ్లను సమీక్షించింది. అలాగే, కోవిడ్ -19 సెకండ్ వేవ్.. ఎకానమీ ప్రభావాన్ని తగ్గించడానికి RBI ఇటీవల తీసుకున్న చర్యలు పరిగణనలోకి తీసుకున్నారు.

బోర్డు సమావేశంలో తొమ్మిది నెలల (జూలై 2020-మార్చి 2021) మధ్య సమయంలో ఆర్‌బీఐ పనితీరుపై చర్చించారు. ఈసారి ఆర్‌బీఐ తన అకౌంటింగ్ సంవత్సరాన్ని మార్చడం గమనార్హం. RBI అకౌంటింగ్ సంవత్సరం సాధారణంగా ఏప్రిల్ నుండి మార్చి వరకు ఉంటుంది. అంతకుముందు, ఆర్‌బీఐ జూలై-జూన్ అకౌంటింగ్ సంవత్సరాన్ని పరిగణించేది. కాబట్టి, జూలై 2020-మార్చి 2021 పరివర్తన కాలం. సమావేశంలో, ఆర్‌బీఐ వార్షిక నివేదిక మరియు ఈ పరివర్తన కాలానికి సంబంధించిన ఖాతాలకు బోర్డు అనుమతి ఇచ్చింది.

కరెన్సీ ట్రేడింగ్‌, బాండ్ల ట్రేడింగ్‌ ద్వారా ఆర్‌బీఐ భారీగా ఆదాయం పొందుతుంది. అందు మెయింటెనెన్స్ కోసం కొంత మొత్తం ఉంచుకొని మిగిలిన నిధులను.. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాల కోసం అందజేస్తుంది. అలా ఇప్పుడు కూడా రూ. 99వేల 122కోట్లను ట్రాన్స్‌ఫర్ చేసేందుకు నిర్ణయించినట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ సమావేశానికి డిప్యూటీ గవర్నర్లు మహేష్ కుమార్ జైన్, మైఖేల్ దేవవ్రతా పాట్రా, ఎం. రాజేశ్వర్ రావు, టి రవిశంకర్ కూడా హాజరయ్యారు.