Eknath Shinde: షిండే సీఎం అయ్యిండు.. టేబుళ్లెక్కి డ్యాన్స్ చేసిన సేన రెబల్స్ ఎమ్మెల్యేలు.. వీడియో వైరల్

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి ఊహించని రీతిలో తెరపడింది. శివసేన రెబల్స్ ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, సీఎంగా ఫడ్నవీస్ బాధ్యతలు స్వీకరిస్తారని అందరూ భావించారు. కానీ చివరి నిమిషంలో శివసేన రెబల్స్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహించిన ఏక్ నాథ్ షిండేను బీజేపీ అధిష్టానం సీఎంగా ప్రకటించింది.

Eknath Shinde: షిండే సీఎం అయ్యిండు.. టేబుళ్లెక్కి డ్యాన్స్ చేసిన సేన రెబల్స్ ఎమ్మెల్యేలు.. వీడియో వైరల్

Sindhe

Eknath Shinde: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి ఊహించని రీతిలో తెరపడింది. శివసేన రెబల్స్ ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, సీఎంగా ఫడ్నవీస్ బాధ్యతలు స్వీకరిస్తారని అందరూ భావించారు. కానీ చివరి నిమిషంలో శివసేన రెబల్స్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహించిన ఏక్ నాథ్ షిండేను బీజేపీ అధిష్టానం సీఎంగా ప్రకటించింది. దీంతో గురువారం 7.30 గంటలకు షిండే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే మంత్రి వర్గ విస్తరణ వారంలో ఉంటుందని, బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు శివసేన రెబల్స్ కు మంత్రి వర్గంలో అవకాశం ఉంటుందని బీజేపీ నేత ఫడ్నవీస్ వెల్లడించారు.

తమ నాయకుడు ఏక్ నాథ్ షిండే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతుండటంతో శివసేన రెబల్ ఎమ్మెల్యేల ఆనందానికి అడ్డులేకుండా పోయింది. గోవాలోని ఓ హోటల్ లో మకాం వేసిన రెబల్ ఎమ్మెల్యేలు సంతోషంగా డ్యాన్స్ లు వేశారు. కొందరు ఎమ్మెల్యేలు ఏకంగా టేబుళ్లు ఎక్కి డ్యాన్స్ లు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం పర్చారు.

Maharashtra Politics: వ్యూహం మార్చిన బీజేపీ.. ఆ అపవాదును తొలగించుకొనేందుకే షిండేకు సీఎం పదవి

శివసేన రెబల్స్ ఎమ్మెల్యేలు 39 మంది ఏక్ నాథ్ షిండే క్యాంపులో ఉన్నారు. బుధవారం వరకు గౌహితిలో ఉన్న వారు గురువారం గోవాలోని ఓ హోటల్ కు మకాం మార్చారు. షిందే మాత్రం గురువారం మధ్యాహ్నం గోవా నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి తిరిగి వచ్చారు. అనంతరం నేరుగా ఫడ్నవీస్ ఇంటికి వెళ్లారు. వారిద్దరు కలిసి రాజ్ భవన్ కు వెళ్లి మహారాష్ట్ర గవర్నర్ ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు గురించి ప్రకటించారు. రాత్రి 7.30గంటలకు షిండే మహారాష్ట్ర 20వ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.