Redmi A2 Series : అత్యంత సరసమైన ధరకే రెడ్‌మి A2 సిరీస్.. భారత్‌లో కేవలం రూ.5,999 మాత్రమే.. సేల్ ఎప్పటినుంచంటే?

Redmi A2 Series : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రెడ్‌మి నుంచి A2 సిరీస్ వచ్చేసింది. భారత మార్కెట్లో కేవలం రూ.5,999కి మాత్రమే సొంతం చేసుకోవచ్చు.

Redmi A2 Series : అత్యంత సరసమైన ధరకే రెడ్‌మి A2 సిరీస్.. భారత్‌లో కేవలం రూ.5,999 మాత్రమే.. సేల్ ఎప్పటినుంచంటే?

Redmi A2, Redmi A2 Plus launched in India, starting price set at as low as Rs 5999

Redmi A2 Series launched in India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) సబ్ బ్రాండ్ రెడ్‌మి నుంచి రెండు సరికొత్త బడ్జెట్ ఫోన్లను లాంచ్ చేసింది. భారత మార్కెట్లో రెడ్‌మి A2, రెడ్‌మి A2 ప్లస్ అనే బడ్జెట్ ఫోన్లను రిలీజ్ చేసింది. Redmi A2 సిరీస్ ప్రారంభ ధర రూ. 5,999తో మార్కెట్లోకి వచ్చింది. Redmi A2 Plus రెండింటిలో అత్యంత ఖరీదైన మోడల్ అని చెప్పవచ్చు. Redmi A2 Plus కొన్ని ముఖ్య ఫీచర్లలో ఆక్టా-కోర్ Helio G36 ప్రాసెసర్, 6.52-అంగుళాల డిస్ప్లే, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్, 10W ఇన్-బాక్స్ ఛార్జర్‌తో కూడిన 500mAh బ్యాటరీ, 8-MP డ్యూయల్ కెమెరా సిస్టమ్ కలిగి ఉంది.

డిజైన్ పరంగా చూస్తే.. రెడ్‌మి A2 ఫోన్‌లు ఇతర బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే కనిపిస్తాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు సీ గ్రీన్, కామింగ్ ఆక్వా బ్లూ, క్లాసిక్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు Amazon.in, Mi.com, Mi Home నుంచి మే 23 మధ్యాహ్నం 12 గంటలకు అన్ని రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయొచ్చు.

Read Also : Twitter CEO : ట్విట్టర్‌‌లో ఇకపై 2 గంటల నిడివి వీడియోలను అప్‌లోడ్ చేయొచ్చు.. వారికి మాత్రమేనట.. మస్క్ మళ్లీ ఫిట్టింగ్ పెట్టాడుగా..!

భారత్‌లో రెడ్‌మి A2 సిరీస్ ధర ఎంతంటే? :
రెడ్‌మి రెండు ఫోన్‌ల ధరలను వెల్లడించింది. Redmi A2 Plus (4GB + 64GB)తో ఒకే ఒక వేరియంట్‌తో వస్తుంది. ఈ మోడల్ ధర రూ. 8499గా నిర్ణయించింది. Redmi A2 మూడు వేరియంట్‌లలో వస్తుంది. అందులో (2GB + 32GB) రూ. 5,999గా ఉండగా.. 2GB + 64GB మోడల్ ధర రూ. 6,499, 4GB + 64GB ధర రూ. 7,499గా నిర్ణయించింది. రెడ్‌మి ఆఫర్‌లో భాగంగా, ICICI బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లు ఈ డివైజ్ కొనుగోలుపై రూ. 500 వరకు అదనపు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

Redmi A2, Redmi A2 Plus launched in India, starting price set at as low as Rs 5999

Redmi A2 Series launched in India, starting price set at as low as Rs 5999

రెడ్‌మి A2, రెడ్‌మి A2 ప్లస్ స్పెసిఫికేషన్స్ ఇవే :
ఈ రెండు బడ్జెట్ రెడ్‌మి ఫోన్‌లు 6.52-అంగుళాల HD ప్లస్‌తో వస్తాయి. బ్రైట్ కలర్స్, అద్భుతమైన వ్యూ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో 120Hz టచ్ శాంప్లింగ్ రేట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, ఇంటర్నల్ FM రేడియో యాప్ కూడా ఉన్నాయి. హార్డ్‌వేర్ ముందు, Redmi A2 సిరీస్ లేటెస్ట్ octa-core MediaTek Helio G36 ప్రాసెసర్‌తో పాటు 4GB వరకు RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో లాగ్-ఫ్రీ పర్ఫార్మెన్స్ అందిస్తుందని యూజర్లకు గేమింగ్, మల్టీమీడియా ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఆక్టా-కోర్ హీలియో G36 ప్రాసెసర్ 3GB వర్చువల్ RAMను కలిగిన 7GB RAMతో వస్తుంది.

ఈ రెండు ఫోన్‌లు 10W ఇన్-బాక్స్ ఛార్జర్‌తో 5000mAhతో వస్తాయి. రెడ్‌మి ఒకే ఫుల్ ఛార్జ్‌తో స్మార్ట్‌ఫోన్‌లు ఒక నెల (32 రోజులు) కన్నా ఎక్కువ కాలం స్టాండ్‌బైతో వస్తాయి. మ్యూజిక్ ప్లేబ్యాక్, వీడియో ప్లేబ్యాక్ వంటి మితమైన వినియోగాన్ని అందించనుంది. వీడియో ప్లేబ్యాక్, 150 గంటల (32 గంటల వరకు) వరకు అందిస్తుంది. కెమెరా స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. Redmi A2 సిరీస్ వెనుక 8-MP డ్యూయల్ కెమెరా సిస్టమ్‌తో వీడియో కాలింగ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌లు పోర్ట్రెయిట్ మోడ్, టైమ్-లాప్స్, షార్ట్ వీడియో ఫీచర్‌లను కూడా అందిస్తుంది.

Read Also : Elon Musk : ట్విట్టర్ డేటాను మైక్రోసాఫ్ట్ అక్రమంగా వాడేస్తోంది.. ఇక ఆపేయ్.. సత్య నాదేళ్లకు ఎలన్ మస్క్ స్వీట్ వార్నింగ్..!