Union Cabinet Reshuffle: వచ్చేవారం కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.. కీలక మంత్రులకు ఉద్వాసన.. !

మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ధర్మేంద్ర ప్రదాన్, గజేంద్ర సింగ్ షేకావత్, జితేంద్ర సింగ్, భుపేంద్ర యాదవ్, నరేంద్ర సింగ్ తోమర్, మన్సుక్ మండవియ, మురళీధరన్, కిషన్ రెడ్డిలతోపాటు పలువురికి ఉద్వాసన పలకబోతున్నట్లు సమాచారం.

Union Cabinet Reshuffle: వచ్చేవారం కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.. కీలక మంత్రులకు ఉద్వాసన.. !

Union Cabinet Reshuffle

Updated On : July 5, 2023 / 2:23 PM IST

Union Cabinet Reshuffle: 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) సిద్ధమయ్యారు. జూలై 9, 10 తేదీల్లో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (Union Cabinet Reshuffle) ఉంటుందని, కీలక మంత్రులకు ఉద్వాసన పలకబోతున్నట్లు తెలుస్తోంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలోనే మంత్రి వర్గం విస్తరణ జరుగుతుందని అందరూ భావించారు. కానీ, ఈ భేటీలో ఆమేరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరో వారం రోజుల్లో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని, కీలక మంత్రులతోపాటు మొత్తం 15 నుంచి 20 మంది మంత్రులకు ఉద్వాసన పలకబోతున్నట్లు తెలుస్తోంది.

NCP Pawar Vs Pawar: మహారాష్ట్ర ఎన్సీపీలో ‘ప’వార్ గేమ్

మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ధర్మేంద్ర ప్రదాన్, గజేంద్ర సింగ్ షేకావత్, జితేంద్ర సింగ్, భుపేంద్ర యాదవ్, నరేంద్ర సింగ్ తోమర్, మన్సుక్ మండవియ, మురళీధరన్, కిషన్ రెడ్డిలకు ఉద్వాసన పలకబోతున్నట్లు సమాచారం. అయితే, ఈసారి శివసేన, లోక్‌జన శక్తి పార్టీలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో కేబినెట్లో మార్పులు చేర్పులు భారీగా ఉంటాయని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.

Raj Thackeray : ఎన్సీపీలో చీలిక వెనుక శరద్ పవార్ హస్తం.. రాజ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఇప్పటికే పావులు కదుపుతోంది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీలో పలు కీలక మార్పులు చేసింది. అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్‌ను తొలగించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈటలకు ఎన్నికల కమిటీ చైర్మన్‌గా కేంద్ర పార్టీ అధిష్టానం నియమించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియామకం కావడంతో కేంద్ర కేబినెట్ నుంచి ఆయనకు ఉద్వాసన పలుకుతారని తెలుస్తోంది. కిషన్ రెడ్డి స్థానంలో బండి సంజయ్‌ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.