Revanth Challenged Etala : చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ కు రావాలని రేవంత్ సవాల్.. సవాళ్లపై స్పందించ వద్దని ఈటల నిర్ణయం

కాంగ్రెస్ పార్టీలోని బలహీన వర్గాల నాయకులే మునుగోడు ఎన్నికలకు ఆర్ధిక సాయం చేశారని స్పష్టం చేశారు. బలహీన వర్గాల నాయకుల శ్రమను, ఆర్థిక సాయాన్ని అవమానించేలా ఈటెల మాట్లాడారని రేవంత్ మండిపడ్డారు.

Revanth Challenged Etala : చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ కు రావాలని రేవంత్ సవాల్.. సవాళ్లపై స్పందించ వద్దని ఈటల నిర్ణయం

Revanth Challenged Etala

Revanth Challenged Etala : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఒకరినొకరు పరస్పర విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్ రూ.25 కోట్లు కాంగ్రెస్ కు ఇచ్చారని ఈటెల రాజేందర్ ఆరోపణలు చేశారు. ఈటెల రాజేందర్ ఆరోపణలపై రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలను 24 గంటల్లో నిరూపించాలని ఈటెలకు రేవంత్ సవాల్ చేశారు.

అందుకు శనివారం సాయంత్రం 6 గంటలకు ఈటెల రాజేందర్ చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయానికి రావాలని రేవంత్ అన్నారు. భాగ్యలక్ష్మి దేవాలయంలో తడి బట్టలతో ప్రమాణానికి తాను సిద్ధమని రేవంత్ చెప్పారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం 6 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయానికి రానున్నారు. ఒక్క రూపాయి కూడా టీఆర్ఎస్ నుంచి గానీ, కేసీఆర్ నుంచి సాయం పొందలేదని రేవంత్ స్పష్టం చేశారు.

Addanki Dayakar: ఈటల భాగ్యలక్ష్మి టెంపుల్‌కు రాకుంటే రాజకీయ వ్యభిచారిగా మిగిలిపోతారు

మునుగోడు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయి కార్యకర్తలు చందాలు వేసుకున్నవేనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోని బలహీన వర్గాల నాయకులే మునుగోడు ఎన్నికలకు ఆర్ధిక సాయం చేశారని స్పష్టం చేశారు. బలహీన వర్గాల నాయకుల శ్రమను, ఆర్థిక సాయాన్ని అవమానించేలా ఈటెల మాట్లాడారని రేవంత్ మండిపడ్డారు. రాజకీయాల కోసం ఈటెల దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయానికి బయలుదేరి వెళ్లనున్నారు. మరోవైపు రేవంత్ సవాళ్లపై స్పందించ వద్దని ఈటల రాజేందర్ నిర్ణయం తీసుకున్నారు. నిన్ననే (శుక్రవారం) సమాధానం చెప్పానని ఈటల అంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే అంటూ విమర్శలు చేశారు.

Vijayashanthi : మీరు పరస్పర విమర్శలు చేసుకోకుండా ప్రభుత్వంపై పోరాడాలి.. రేవంత్, ఈటలకు విజయశాంతి సూచనలు

ముడునుగో లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ రూ.25 కోట్లు ఇచ్చిందని ఆరోపణ అని అన్నారు. ఇది బహిరంగ రహస్యం అంటూ ఉదరిహరించారు. ఎన్నికల ముందు కానీ తరువాత కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు ఉంటుందని జోష్యం చెప్పారు. జాతీయ పార్టీలకు ఢిల్లీ(దేశ) రాజకీయాలు ముఖ్యం కానీ, స్టేట్ రాజకీయాలపై పెద్దగా పాటించుకోరని ఈటెల రాజేందర్ అన్నారు.