RGV : కొత్త చరిత్ర సృష్టించారంటూ.. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా పై ఆర్జీవీ ట్వీట్..

ఆర్జీవీ ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూసి దీనిపై ట్వీట్ చేశారు. ''డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాతో పేలుడు పదార్థాలు కంటే అధికంగా ఫైర్ అయ్యారు. ఈ సినిమాతో బాలీవుడ్ ని......

RGV : కొత్త చరిత్ర సృష్టించారంటూ.. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా పై ఆర్జీవీ ట్వీట్..

Rgv

 

The Kashmir Files :  ఇటీవల కాశ్మీర్ లో హిందువులపై, కాశ్మీర్ పండిట్లపై 1980-90 దశకంలో జరిగిన మారణకాండని ఆధారంగా తీసుకొని ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాని తెరకెక్కించారు. మార్చ్ 11న దేశ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయం సాధించి కలెక్షన్లని కూడా రాబడుతుంది. ఈ సినిమాని జీ స్టూడియోస్ మరియు తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిసి సంయుక్తంగా నిర్మించగా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించారు.

‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూసిన వారంతా డైరెక్టర్, చిత్ర యూనిట్ లను అభినందిస్తున్నారు. సెలబ్రిటీలు సైతం ఈ సినిమాని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సినిమా చూసి చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా అభినందించారు అంటే ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో అర్ధం చేసుకోవచ్చు. మౌత్ టాక్ తోనే ఈ సినిమా రోజు రోజుకి మరింత పాపులర్ అవుతుంది. తాజాగా ఈ సినిమాపై సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ కూడా ట్వీట్ చేయడం గమనార్హం.

The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో ఏముంది? ఇటు బెదిరింపులు.. అటు కలెక్షన్లు

ఆర్జీవీ ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూసి దీనిపై ట్వీట్ చేశారు. ”డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాతో పేలుడు పదార్థాలు కంటే అధికంగా ఫైర్ అయ్యారు. ఈ సినిమాతో బాలీవుడ్ ని తొక్కేసి కొత్తగా వివేక్ వుడ్ ని స్థాపించినట్టే. ఈ సినిమాతో కొత్త సినిమా దర్శక నిర్మాతలకి స్ఫూర్తిగా నిలిచాడు వివేక్. ‘ది కశ్మీర్ ఫైల్స్’ కమర్షియల్ సక్సెస్ ని పక్కన పెడితే అంతకంటే కూడా భారీ విజయం సాధించింది” అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’ పై ఆర్జీవీ ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.