RRR : IMDB వరల్డ్ టాప్ 5 సినిమాలలో ‘ఆర్ఆర్ఆర్’.. రేటింగ్‌లో నంబర్ 1

తాజాగా 'ఆర్ఆర్ఆర్' సినిమా మరో రికార్డు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా సినిమాలకు రేటింగ్‌లు, రివ్యూలు ఇచ్చే ప్రముఖ సంస్థ IMDB తాజాగా 2022 మోస్ట్ పాపులర్ చిత్రాల జాబితాను విడుదల.......

RRR : IMDB వరల్డ్ టాప్ 5 సినిమాలలో ‘ఆర్ఆర్ఆర్’.. రేటింగ్‌లో నంబర్ 1

Rrr

RRR :  చరణ్, తారక్ కాంబినేషన్ లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 900 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి 1000 కోట్లకు పరుగులు పెడుతుంది. కలెక్షన్లతో పాటు అనేక రికార్డులని సాధిస్తుంది. కొన్ని విషయాల్లో హాలీవుడ్ సినిమాలని కూడా బీట్ చేస్తుంది ‘ఆర్ఆర్ఆర్’.

తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మరో రికార్డు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా సినిమాలకు రేటింగ్‌లు, రివ్యూలు ఇచ్చే ప్రముఖ సంస్థ IMDB తాజాగా 2022 మోస్ట్ పాపులర్ చిత్రాల జాబితాను విడుదల చేసింది. ఇందులో ‘ఆర్ఆర్ఆర్’ స్థానం సంపాదించింది. ఈ లిస్ట్ లో ఆస్కార్ అవార్డును అందుకున్న CODA మూవీ మొదటి స్థానంలో నిలవగా తర్వాత స్థానాల్లో Death on the Nile, Morbius, The Batman ఉన్నాయి. ఐదో స్థానంలో మన RRR మూవీ స్థానం సంపాదించి హాలీవుడ్ సినిమాలని వెనక్కి నెట్టేసి సరికొత్త రికార్డుని సృష్టించింది.

Kuwait : విజయ్ ‘బీస్ట్’ సినిమాని బ్యాన్ చేసిన ఆ దేశం..

ఇక మోస్ట్ పాపులర్ సినిమాల్లో 5వ స్థానం సంపాదించినా రేటింగ్ లో మాత్రం మొదటి స్థానం సంపాదించింది. రేటింగ్‌లో వరల్డ్ రికార్డు కొట్టేసింది ఆర్ఆర్ఆర్. IMDB విడుదల చేసిన ఈ లిస్ట్ లో ఉన్న అన్నిటికంటే ఎక్కువగా 9 రేటింగ్ సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఆస్కార్ విన్నింగ్ CODA మూవీకి 8.1 రేటింగ్ దక్కింది. ఇలా ఆర్ఆర్ఆర్ మరో కొత్త రికార్డు సృష్టించింది. దీంతో చిత్ర యూనిట్ తో పాటు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.