Nick Powell : ‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి

తాజాగా 'ఆర్ఆర్ఆర్' సినిమా స్టంట్ మాస్టర్ నిక్ పావెల్ హైదరాబాద్ కి రాగా ఈ సినిమా గురించి 10 టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్.......

Nick Powell : ‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి

RRR :  తెలుగుతో పాటు భారతదేశం మొత్తం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ఎదురు చూస్తుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇప్పటికే కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఇటీవల మార్చ్ 25న ఈ సినిమా విడుదల చేయనున్నట్టు తెలిపారు. పాన్ ఇండియా సినిమాగా అన్ని భాషల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతుంది. ఇందులో బాలీవుడ్, హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటించారు.

తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా స్టంట్ మాస్టర్ నిక్ పావెల్ హైదరాబాద్ కి రాగా ఈ సినిమా గురించి 10 టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ మాట్లాడుతూ.. ”ఆర్ఆర్ఆర్ లో చాలా బిగ్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అవి చాలా డిఫికల్ట్ సీన్స్. రాజమౌళికి ఏం కావాలో అది చాలా క్లారిటీగా చెప్తారు. నాకు ఉన్న ఐడియాలను కూడా రాజమౌళికి చెప్పాను. రాజమౌళితో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు నేను చేయాల్సిన సీన్స్ ని షూట్ కి నెల ముందే రాజమౌళి అర్ధం అయ్యేలా చెప్పారు. క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్స్ చాలా పెద్ద సీక్వెన్స్. సినిమాకి ఇవి చాలా ప్లస్ అవుతాయి. క్లైమాక్స్ సీన్స్ కోసం చాలా కష్టపడ్డాం” అని తెలిపారు.

Radhakrishna : ‘బాహుబలి’ కంటే ముందే ‘రాధేశ్యామ్’ మొదలైంది

ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి నిక్ పావెల్ మాట్లాడుతూ..”రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇందులో ఫైట్ సీక్వెన్స్ కోసం బాగా కష్టపడ్డారు. వారిద్దరూ ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. యాక్షన్ సీన్స్ చేసేటప్పుడు ఇద్దరూ చాలా సార్లు కింద పడ్డారు. అయినా మళ్ళీ అదే ఉత్సాహంతో పని చేసేవారు. వారిద్దరూ చాలా ఫన్నీగా కూడా ఉండేవారు. క్లైమాక్స్ సీన్స్ లో చాలా ఫన్నీ సీన్స్ జరిగాయి. షూటింగ్ లో వర్క్ ని ఎంజాయ్ చేశాము” అని తెలిపారు.