Tamil Nadu RTC Driver : 30 మంది ప్రాణాలు కాపాడి మృత్యు ఒడికి

బస్సు ప్రయాణం ప్రారంభమైన ఐదు నిమిషాలకే డ్రైవర్ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే బస్సు పక్కకు నిలిపి సీటులోనే ప్రాణాలు వదిలారు. ఆ సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు.

Tamil Nadu RTC Driver : 30 మంది ప్రాణాలు కాపాడి మృత్యు ఒడికి

Tn Rtc

Updated On : December 10, 2021 / 11:37 AM IST

Tamil Nadu RTC Driver : బస్సు ప్రయాణం ప్రారంభమైన ఐదు నిమిషాలకే డ్రైవర్ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే బస్సు పక్కకు నిలిపి సీటులోనే ప్రాణాలు వదిలారు. ఆ సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు. తనకు ప్రమాదం ఎదురవబోతుందని ముందే గుర్తించి బస్సును పక్కకు ఆపడంతో 30 మంది సురక్షితంగా బయటపడ్డారు. కాగా ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళితే తమిళనాడు స్టేట్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో ఎమ్ ఆరుముగన్ (44) గత పన్నెండేళ్లుగా డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నారు.

చదవండి : Sangam Auto Accident : సంగం ఆటో ప్రమాదం.. వాగులో గల్లంతైన ప్రయాణికుల కోసం ముమ్మర గాలింపు

గురువారం ఉదయం 6.20 నిమిషాల సమయంలో కండక్టర్ భాగ్యరాజ్‌తో కలిసి మధురై జిల్లాలోని అరప్పాలయం నుంచి కొడైకెనాల్‌కు బస్సు బయలు దేరింది. నిమిషాలకు గురు థియేటర్‌ వద్దరు చేరుకోగానే డ్రైవర్ ఆరుముగన్ కి గుండెలో నొప్పిగా అనిపించి.. బస్సు పక్కకు ఆపాడు. తనకు ఛాతి నొప్పిగా ఉందని కండెక్టర్ కు తెలిపాడు. దీంతో కండక్టర్ భాగ్యరాజ్ అంబులెన్స్‌కి ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చేలోపే ఆరుముగన్ డ్రైవర్ సీట్లో కుప్పకూలిపోయారు మృతి చెందాడు. తన ప్రాణానికి ప్రమాదం ఉందని ముందే గ్రహించి 30 మందిని కాపాడాడు ఆరుముగన్. కాగా మృతుడికి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

చదవండి : Vizianagaram Accident : పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. 22 మందికి గాయాలు