Vadodara Girl: పెంపుడు కుక్క చనిపోయిందనే బెంగతో చిరుతను తెచ్చుకున్న యువతి

పెంపుడు జంతువులను కుటుంబ సభ్యులుగా మార్చేసుకుంటున్నారు. ఎంతలా అంటే, కొందరు పెంపుడు జంతువులే తోడుగా భావించి పెళ్లిళ్లకూ దూరంగా ఉండిపోతున్నారు. అవి చూపించే ప్రేమ, అభిమానం అలాంటివి మరి. ఒక్కో సమయంలో వాటిని కోల్పోయినప్పుడు ఆపలేని దుఃఖం, భరించలేనంత ఒంటరితనం అనుభవించాల్సిందే.

Vadodara Girl: పెంపుడు కుక్క చనిపోయిందనే బెంగతో చిరుతను తెచ్చుకున్న యువతి

Leopard

 

Vadodara Girl: పెంపుడు జంతువులను కుటుంబ సభ్యులుగా మార్చేసుకుంటున్నారు. ఎంతలా అంటే, కొందరు పెంపుడు జంతువులే తోడుగా భావించి పెళ్లిళ్లకూ దూరంగా ఉండిపోతున్నారు. అవి చూపించే ప్రేమ, అభిమానం అలాంటివి మరి.

ఒక్కో సమయంలో వాటిని కోల్పోయినప్పుడు ఆపలేని దుఃఖం, భరించలేనంత ఒంటరితనం అనుభవించాల్సిందే. ఇలాంటి భావోద్వేగాల నుంచి బయటపడాలనుకున్న ఓ యువతి చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు.

పెంపుడు జంతువైన కుక్క ప్లూటో ఆకస్మిక అస్వస్థతకు గురైంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నయం చేయలేకపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. వడోదరాకు చెందిన గరిమా మాల్వాంకర్ చాలా మూడీగా అయిపోయింది. తన ప్రేమను మరొక పెంపుడు జంతువుతో పంచుకోకూడదని నిర్ణయించుకున్నాడు.

కానీ, గరిమా ప్లూటోతో జ్ఞాపకాలను మరిచిపోవడానికి పుట్టినరోజు నాడు సాయాజీబాగ్ జూకి వెళ్లింది. అక్కడ చిరుతపులిని గుర్తించి దానిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది.

Read Also: పెంపుడు కుక్కల పెళ్లి అదుర్స్.. భారీగా తరలివచ్చిన అతిథులు.. ఎక్కడంటే..

“ప్లూటో జూన్ 24న జన్మించింది. నా లాబ్రడార్‌కి దూరమయ్యాను. అది కుటుంబ సభ్యుడిలా ఉండేది. దానిని ఎప్పుడూ కట్టేసి ఉంచలేదు. ప్లూటో చనిపోయిన తర్వాత, దాని జ్ఞాపకార్థం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకున్నా. ప్లూటో పుట్టినరోజున మరో జంతువును దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నా”అని గరిమా మీడియాకు చెప్పారు.

“సయాజీబాగ్ జూలో జంతువులను దత్తత తీసుకోవడం గురించి ఆరా తీశా. చివరకు చిరుతపులిని చూశా. కనీసం ఐదేళ్ల పాటు నా దత్తతలోనే ఉంచుకోవాలని ప్లాన్ చేస్తున్నా” అని చెప్పిందామె.