Vey Dharuvey : ‘వెయ్ దరువేయ్’ టీజర్ రిలీజ్.. ఫుల్ మాస్ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతున్న సాయిరామ్ శంకర్..

143, బంపర్ ఆఫర్.. లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన హీరో సాయిరామ్ శంకర్ చివరగా నేనోరకం సినిమాతో 2017లో ప్రేక్షకులని పలకరించాడు. కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఫుల్ మాస్ మషాలా సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు సాయిరామ్ శంకర్.....................

Vey Dharuvey : ‘వెయ్ దరువేయ్’ టీజర్ రిలీజ్.. ఫుల్ మాస్ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతున్న సాయిరామ్ శంకర్..

Sai Raam Shankar Grand comeback Movie Vey Dharuvey Teaser Released

Vey Dharuvey :  143, బంపర్ ఆఫర్.. లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన హీరో సాయిరామ్ శంకర్ చివరగా నేనోరకం సినిమాతో 2017లో ప్రేక్షకులని పలకరించాడు. కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఫుల్ మాస్ మషాలా సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు సాయిరామ్ శంకర్. సాయిరామ్ శంకర్ హీరోగా, కన్నడ భామ యష శివకుమార్ హీరోయిన్ గా నూతన దర్శకుడు నవీన్ రెడ్డి దర్శకత్వంలో, దేవ్ రాజ్ పోతూరు నిర్మాణంలో సాయి తేజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా ‘వెయ్ దరువేయ్’.

‘వెయ్ దరువేయ్’ అనే టైటిల్ తోనే ఫుల్ మాస్ సినిమా అని అర్థమైపోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. టీజర్ లో.. సాయిరామ్ శంకర్ కామారెడ్డి శంకర్ గా మాస్ యాక్టింగ్, సునీల్ విలనిజం, కామెడీ, హీరోయిన్ యష అందాలు, సాంగ్స్, హెబ్బా పటేల్ ఐటెం సాంగ్, లవ్ అంశాలతో పాటు ఫుల్ యాక్షన్ ఫైట్స్ కూడా చూపించారు. సినిమా కథ అనేది తెలియకుండా టీజర్ చాలా ఆసక్తిగా కట్ చేసి ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచారు. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో సత్యం రాజేష్, సునీల్, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, పోసాని.. లాంటి పలువురు ప్రముఖులు నటించారు.

Ram Charan : బుచ్చిబాబుని ఫ్లైట్ లో తిప్పిన చరణ్.. త్వరలోనే RC16 షూట్ స్టార్ట్ చేద్దాం అంటూ స్పెషల్ ఫోటోలు..

సాయిరామ్ శంకర్ కొంచెం గ్యాప్ తీసుకొని ‘వెయ్ దరువేయ్’ సినిమాతో వస్తుండటంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ‘వెయ్ దరువేయ్’ టీజర్ ని సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ రిలీజ్ చేశాడు. ఇటీవలే ఈ సినిమా నుంచి రిలీజైన మంజుల మంజుల అనే ఐటెం సాంగ్, వెయ్ దరువేయ్ టైటిల్ సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానున్నట్టు సమాచారం. త్వరలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని గ్రాండ్ గా మొదలుపెట్టనున్నారు.