NTR30: ఎన్టీఆర్ సినిమా ఓపెనింగ్‌కు ఆ స్టార్ యాక్టర్ వస్తున్నాడా..?

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ సినిమాను అనౌన్స్ చేసి రోజులు గడుస్తున్నా, ఇంకా ఈ సినిమాను స్టార్ట్ చేయకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో తారక్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ఫ్యాన్స్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ సినిమాను మార్చిలో స్టార్ట్ చేస్తామని తారక్ ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

NTR30: ఎన్టీఆర్ సినిమా ఓపెనింగ్‌కు ఆ స్టార్ యాక్టర్ వస్తున్నాడా..?

Saif Ali Khan To Come Up For NTR30 Movie Opening

NTR30: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ సినిమాను అనౌన్స్ చేసి రోజులు గడుస్తున్నా, ఇంకా ఈ సినిమాను స్టార్ట్ చేయకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో తారక్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ఫ్యాన్స్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ సినిమాను మార్చిలో స్టార్ట్ చేస్తామని తారక్ ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

NTR30: తన నెక్ట్స్ మూవీపై ఎన్టీఆర్ కామెంట్స్.. ‘ఆర్ఆర్ఆర్’ను మ్యాచ్ చేస్తామంటోన్న తారక్!

దీంతో ఈ సినిమా ప్రారంభోత్సవం ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా NTR30 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను మార్చి 18న ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. కాగా, ఈ సినిమా ఓపెనింగ్‌కు ఓ స్టార్ యాక్టర్ రాబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ చిత్ర ప్రారంభోత్సవానికి సైఫ్ అలీ ఖాన్ కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

NTR30: ఆ సూపర్ హిట్ పాటను రీమిక్స్ చేస్తున్న తారక్-జాన్వీ..?

అయితే ఆయన ఈ చిత్ర ఓపెనింగ్‌కు వస్తే ఈ సినిమాలో ఆయన నటిస్తున్నాడనే విషయం దాదాపు ఖరారైనట్లే. మరి ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ఆయన వస్తారా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా, తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.