Samantha : లైఫ్‌లో అసలు టాటూ వేపించుకోకండి

ఓ నెటిజన్ మీరు ఎప్పటికైనా వేసుకోవాలన్న టాటూ ఏంటి అని అడిగారు. దీనికి సమంత సమాధానమిస్తూ.. అసలు టాటూ వేయించుకోవాలి అనుకున్న ఆలోచన కూడా మానుకోండి. లైఫ్ లో ఎప్పుడూ...........

Samantha : లైఫ్‌లో అసలు టాటూ వేపించుకోకండి

Sam Tattoos

 

Samantha :  సెలబ్రిటీలు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకి ఎప్పుడూ టచ్ లో ఉంటారు. వారికి మరింత దగ్గరవడానికి అప్పుడప్పుడు ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలలో అభిమానులతో చిట్ చాట్ నిర్వహిస్తూ ఉంటారు. చైతో విడిపోయిన తర్వాత సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటుంది. తన స్టోరిలలో ఎప్పుడూ ఫోటోలు, మోటివేషన్ కోట్స్ పెడుతూనే ఉంటుంది. సమంత చాలా రోజుల తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు, నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.

ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ మీరు ఎప్పటికైనా వేసుకోవాలన్న టాటూ ఏంటి అని అడిగారు. దీనికి సమంత సమాధానమిస్తూ.. అసలు టాటూ వేయించుకోవాలి అనుకున్న ఆలోచన కూడా మానుకోండి. లైఫ్ లో ఎప్పుడూ టాటూ వేయించుకోకూడదు” అని తెలిపింది. అయితే గతంలో సమంత టాటూలు వేపించుకుంది. సమంత ఒంటిపై మూడు టాటూలు ఉంటాయి. సమంత టాటూలు కూడా ఫేమసే.

BiggBoss Non Stop : బిగ్‌బాస్‌ నుంచి మహేష్ విట్టా అవుట్..

సమంత వీపుపై చై, సమంత కలిసి చేసిన మొదటి సినిమా ఏమాయ చేసావే కి గుర్తుగా ymc అనే టాటూ ఉంటుంది. ఇక సమంత నడుముకి పైభాగంలో చై అని టాటూ ఉంటుంది. అలాగే కుడి చేతి మీద రెండు యారో మార్కులను టాటూ వేయించుకుంది. అయితే ఈ టాటూ చై చేతికి కూడా ఉంటుంది. ‘నీ జీవితం నువ్వు చూసినట్టుగా ఉంటుంది. ఇతరులు చూసినట్టుగా కాదు’ అని ఈ టాటూ అర్ధం. అయితే మూడు టాటూలు కూడా చైకి సంబంధించి వేసుకుంది సమంత. కానీ ఇప్పుడు చైతో విడిపోయింది కాబట్టే ఇంకెప్పుడు లైఫ్ లో టాటూ వేయించుకోకండి అని చెప్తుంది సమంత.