Samantha : డబ్బులిచ్చి నంబర్ 1 స్థానాన్ని కొనుక్కున్నాను..

ఇటీవల భారతదేశంలోని సినీ సెలబ్రిటీలకు పాపులారిటీ ప్రకారం ప్రతి నెల, ప్రతి సంవత్సరం ర్యాంక్స్ ఇస్తుంది ఆర్ మాక్స్ అనే సంస్థ. టీవీ, సినిమా, సౌత్, నార్త్.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఈ ర్యాంక్స్ ప్రకటిస్తుంది. ప్రతి నెల ప్రకటిస్తుండటంతో.......

Samantha : డబ్బులిచ్చి నంబర్ 1 స్థానాన్ని కొనుక్కున్నాను..

Samantha

Samantha :  సమంత ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. అన్ని భాషల్లో ప్రాజెక్టులు చేస్తుంది. ఇటీవలే బాలీవుడ్ ఫేమస్ టాక్ షో కాఫీ విత్ కరణ్ షోలో అక్షయ్ తో కలిసి గెస్ట్ గా వచ్చింది. ఈ షోలో చాలా సందడి చేసింది. అలాగే నాగ చైతన్య గురించి పలు వ్యాఖ్యలు చేసింది. ప్రేమ, పెళ్లి వాటిపై కూడా మాట్లాడింది. ఈ షోలో సమంత నాగచైతన్యపై చేసిన వ్యాఖ్యలు గత రెండు రోజుల నుంచి వైరల్ గా మారాయి. తాజాగా ఇదే షోలో సమంత చేసిన మరో కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

ఇటీవల భారతదేశంలోని సినీ సెలబ్రిటీలకు పాపులారిటీ ప్రకారం ప్రతి నెల, ప్రతి సంవత్సరం ర్యాంక్స్ ఇస్తుంది ఆర్ మాక్స్ అనే సంస్థ. టీవీ, సినిమా, సౌత్, నార్త్.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఈ ర్యాంక్స్ ప్రకటిస్తుంది. ప్రతి నెల ప్రకటిస్తుండటంతో ఈ ర్యాంక్స్ బాగా పాపులర్ అవుతున్నాయి. ఇటీవల ఆర్‌ మాక్స్‌ సంస్థ నిర్వహించిన సర్వేలలో భారతీయ సినీ హీరోయిన్లలో అత్యంత పాపులారిటీ కలిగిన హీరోయిన్ గా సమంత మొదటి ప్లేస్ లో నిలిచింది. బాలీవుడ్ తారలు కూడా సమంత తర్వాతే ఉన్నారు.

Samantha: ఆ సమయంలో జీవితం కష్టంగా అనిపించింది.. నాగచైతన్యతో విడాకుల విషయంపై స్పందించిన సమంత

దీనిపై కరణ్ తన షోలో అడిగాడు. ఆర్‌ మాక్స్‌ సంస్థ సర్వేలో నెంబర్‌ వన్‌ స్థానాన్ని ఎలా దక్కించుకున్నారు అని కరణ్ అడగడంతో సమంత.. ఆ సంస్థకు భారీ మొత్తంలో డబ్బు ఇచ్చి నెంబర్ 1 స్థానాన్ని కొనుక్కున్నాను అని తెలిపింది. దీంతో సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. వేరే హీరోయిన్స్ ఫ్యాన్స్ ఈ విషయంలో సమంతని ట్రోల్ చేస్తుండగా కొంతమంది ఆమె నవ్వుతూ సరదాగా చెప్పింది అని అంటున్నారు. డబ్బులిచ్చి నంబర్ 1 స్థానాన్ని కొనుక్కున్నాను అని సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.