Samantha: సమంత స్వీట్ విషెస్.. అఖిల్ సైలెన్స్!

అక్కినేని యంగ్ హీరో అఖిల్ పుట్టినరోజు సందర్భంగా పలువురు స్టార్స్ ఆయనకు విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో సందడి చేశారు. అటు అఖిల్ బర్త్‌డే....

Samantha: సమంత స్వీట్ విషెస్.. అఖిల్ సైలెన్స్!

Samantha Wishes Akhil Akkineni On His Birthday

Samantha: అక్కినేని యంగ్ హీరో అఖిల్ పుట్టినరోజు సందర్భంగా పలువురు స్టార్స్ ఆయనకు విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో సందడి చేశారు. అటు అఖిల్ బర్త్‌డే కానుకగా ఆయన నటిస్తున్న ఏజెంట్ సినిమా పోస్టర్స్ కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఓ స్టార్ సెలబ్రిటీ అఖిల్‌కు బర్త్ డే విషెస్ చెప్పగా.. దానికి అఖిల్ ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Akhil Akkineni: అఖిల్ బర్త్‌డే.. సారీ చెప్పిన నిర్మాత!

ఇంతకీ అఖిల్ కు బర్త్ డే విషెస్ చెప్పిన ఆ సెలబ్రిటీ ఎవరా అని అనుకుంటున్నారా.. అక్కినేని ఫ్యామిలీ మాజీ కోడలు సమంత. నాగచైతన్యతో విడిపోయిన తరువాత సమంత సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడూ కూడా అక్కినేని ఫ్యామిలీ గురించి ప్రస్తావించని సమంత, తాజాగా అఖిల్ బర్త్‌డే రోజున ఆయనకు విషెస్ చెప్పడంతో అభిమానులు అందరూ అవాక్కయ్యారు. ‘‘హ్యాపీ బర్త్‌డే అఖిల్‌. ఈ ఏడాది అంతా నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా. నువ్వు కోరుకున్నవన్నీ దక్కాలని దేవుడ్ని కోరుకుంటున్నా..’’ అంటూ సమంత పోస్ట్ చేసింది.

Samantha : బాలీవుడ్‌‌కి మకాం.. ముంబైలో ఇల్లు కొంటున్న సమంత..

కాగా ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అక్కినేని ఫ్యామిలీతో తెగతెంపులు చేసుకున్నాక, ఆ కుటుంబానికి చెందిన హీరోకు ఇలా సామ్ విషెస్ చెప్పడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే సామ్ పెట్టిన పోస్ట్‌కు అఖిల్ ఇంకా ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడం గమనార్హం. కాగా సామ్ ప్రస్తుతం పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉంది. అటు బాలీవుడ్‌లోనూ అవకాశాలను దక్కించుకుంటూ సామ్ తన సత్తా చాటుతోంది.

Samantha Wishes Akhil Akkineni