Basara IIIT Students: రెండో దశ చర్చలు విఫలం.. సీఎం కేసీఆర్ రావాల్సిందేనంటూ విద్యార్థుల డిమాండ్..

తమ డిమాండ్లపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు వెనక్కుతగ్గేది లేదంటూ బాసర ట్రిపుల్ ఐటీ (రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం) విద్యార్థులు తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్ వచ్చి సమస్యలు పరిష్కరించాలంటూ పన్నెండు డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు.

Basara IIIT Students: రెండో దశ చర్చలు విఫలం.. సీఎం కేసీఆర్ రావాల్సిందేనంటూ విద్యార్థుల డిమాండ్..

Basara

Basara IIIT Students: తమ డిమాండ్లపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు వెనక్కుతగ్గేది లేదంటూ బాసర ట్రిపుల్ ఐటీ (రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం) విద్యార్థులు తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్ వచ్చి సమస్యలు పరిష్కరించాలంటూ పన్నెండు డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు. ట్రిపుల్ ఐటీలో తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నామని ఎనిమిది వేల మంది విద్యార్థులు, కళాశాల అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు. వీరి ఆందోళనకు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు మద్దతు తెలపడంతో ఈ ప్రాంతంలో ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది. సమస్యలు పరిష్కరించే వరకు తాము ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు.

మరోవైపు విద్యార్థుల ఆందోళనపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ట్రిపుల్ ఐటీలో సమస్యలను తెలంగాణ సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. ట్రిపుల్ ఐటీ విద్యా నాణ్యతను పెంచేందుకు, సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని ట్విటర్ వేదికగా తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ.. ట్రిపుల్ ఐటీలో సమస్యలను వీలైంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ విషయంపై వైస్ ఛాన్సలర్ (వీసీ)తో సమావేశం కానున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో విద్యార్థులతో అధికారులు రెండు దఫాలుగా చర్చలు జరిపారు. రెండవ దశ చర్చలు విఫలం అయ్యాయి. ఈ సందర్భంగా రేపు యథావిధిగా ఆందోళన కొనసాగుతుందని ప్రకటించారు. చర్చల్లో భాగంగా 12డిమాండ్లు సాధనపై ప్రస్తావించారు. అయితే తక్షణ తాత్కాలిక వసతులకు, 12లక్షల నిధులకు విద్యార్థులు నో చెప్పారు. సీఎం కేసీఆర్ యూనివర్సిటీకి రావాల్సిందే అని విద్యార్థులు తెగేసి చెప్పారు. విద్యాశాఖ మంత్రి‌ హామీకి ఒప్పుకోని విద్యార్థులు, కేసులు పెట్టిన వెనక్కి తగ్గమంటూ తేల్చిచెప్పారు. అయితే చర్చలు రహస్యంగా జరిపితే కుదరదని ఐదువేల మంది విద్యార్థుల మద్యే సమావేశం చర్చలు కొనసాగాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.  ఇదిలాఉంటే విద్యార్థుల సమస్యలపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ప్రభుత్వ నిర్వాకం ఇలా ఉందంటూ ఆయన మండిపడ్డారు. అక్కడ కనీస సౌకర్యాలు లేవు, భోజన వసతి లేదు, 169 మంది ప్రొఫెసర్లు ఉండాల్సిన చోట రెగ్యూలర్ వాళ్లు కేవలం 15 మందే ఉన్నారు. వీసీ అసలే లేడు. ఇదీ చదువుల తల్లి బాసర సరస్వతి చెంత త్రిపుల్ ఐటీలో తాజా పరిస్థితి. అయితే కేసీఆరేమో దేశాన్ని ఉద్దరించే పనిలో బిజీగా ఉన్నాడంటూ విమర్శించారు.