Vaccine Mixing : కోవిషీల్డ్, కోవాగ్జిన్ మిక్సింగ్…సీరం చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

వ్యాక్సిన్ మిక్సింగ్ ఓ బ్యాడ్ ఐడియా అని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మస్ సైరస్ పూనావాలా అన్నారు. ప్రతిపాదిత కోవీషీల్డ్-కోవాగ్జిన్ మిక్సింగ్ ను ఆయన వ్యతిరేకించారు.

Vaccine Mixing : కోవిషీల్డ్, కోవాగ్జిన్ మిక్సింగ్…సీరం చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

Poonawala

Vaccine Mixing వ్యాక్సిన్ మిక్సింగ్ ఓ బ్యాడ్ ఐడియా అని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మస్ సైరస్ పూనావాలా అన్నారు. ప్రతిపాదిత కోవీషీల్డ్-కోవాగ్జిన్ మిక్సింగ్ ను ఆయన వ్యతిరేకించారు. కాగా, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా.. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోవిషీల్డ్ టీకాల మిక్సింగ్‌కు సంబంధించిన అధ్యయనానికి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో పూనావాలా ఈ వ్యాఖ్యలు చేశారు.

డోసులను మిక్స్ లేదా కలపడం చేయాల్సిన అవసరం లేదని పూనావాలా పేర్కొన్నారు. శుక్రవారం పూణేలోని తిలక్ మహారాష్ట్ర విద్యాపీఠ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సైరస్ పూనావాలా వ్యాక్సిన్ల మిక్సింగ్ గురించి మాట్లాడుతూ.. ఒకవేళా ఏదైనా తప్పు జరిగితే..ఈ రెండు వ్యాక్సిన్ తయారీదారుల మధ్య తుగువులాట వచ్చే అవకాశముందన్నారు. ఏదైనా అనుకోనిది జరిగితే..ఇతర వ్యాక్సిన్ మంచిది కాద అని సీరం సంస్థ అంటదని..దీంతో వాళ్లు(మరో వ్యాక్సిన్ కంపెనీ)మా వ్యాక్సిన్ లోనే లోపం ఉందంటూ సీరంపై నిందలు వేస్తారు. కాబట్టి వ్యాక్సిన్ లను మిక్స్ చేయడం చాలా తప్పు అని నేను అనుకుంటున్నా అని సైరస్ పూనావాలా అన్నారు. ఫీల్డ్ ట్రయిల్స్ లో వ్యాక్సిన్ మిక్సింగ్ రుజువు అవ్వలేదని తెలిపారు.

కాగా, భారత్ లో కోవాగ్జిన్,కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మిక్సింగ్ పై అధ్యయనానికి డీసీజీఐ(భారత ఔషధ నియంత్రణ సంస్థ) రెండు రోజుల క్రితం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూర్ లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ 300 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లపైఈ అధ్యయనం నిర్వహించనుంది. ఈ అధ్యయనం యొక్క ఉద్దేశ్యం..వ్యాక్సినేషన్ కోర్సుని పూర్తి చేయడానికి ఒక వ్యక్తికి రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులను ఇవ్వగలమా లేదా అని అంచనా వేయడం. కాగా,జులై-29న సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్(CDSCO)కి చెందిన సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ ఈ అధ్యయ నిర్వహణకు రికమండ్ చేసింది.