Sharukh khan : జైల్లో ఆర్యన్ ని మొదటిసారి కలిసిన షారుఖ్.. కన్నీళ్లు పెట్టుకున్న ఆర్యన్

షారూఖ్ ఖాన్ కూడా ఇవాళ ఉదయం తన కుమారుడు ఆర్యన్‌ను కలిసేందుకు జైలుకు వెళ్లారు. జైలు ప్రవేశ ద్వారం వద్ద ఆధార్ కార్డు, ఇతర పత్రాలు చూపించి లోపలికి వెళ్లారు షారూఖ్ ఖాన్. సాధారణ పౌరుడిలా

Sharukh khan : జైల్లో ఆర్యన్ ని మొదటిసారి కలిసిన షారుఖ్.. కన్నీళ్లు పెట్టుకున్న ఆర్యన్

Sharukh (1)

Sharukh khan :  డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడు ఆర్యన్ అరెస్ట్ అయినా సంగతి తెలిసిందే. షారుఖ్ బెయిల్ కోసం అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాడు. కాని కోర్టులో బెయిల్ తిరస్కరిస్తున్నారు. ఆర్యన్ కేవలం డ్రగ్స్ తీసుకోవడమే కాక ఇంటర్నేషనల్ డ్రగ్ డీలర్స్ తో సంబంధాలు ఉన్నట్టు, లావాదేవీలు జరిపినట్టు తెలియడంతో ఎన్సీబీ ఈ కేసుని మరింత లోతుగా శోధిస్తుంది. ఈ కేసులో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ రావడం లేదు. ఇప్పటికే మూడు సార్లు తిరస్కచించారు. ఆయనకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలున్నాయని, బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని ముంబైలోని స్పెషల్ కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆర్యన్ ఖాన్ జైలుకే పరిమతమయ్యాడు.

తాజాగా ఇవాళ్టి నుంచి కరోనా నిబంధనలను మహారాష్ట్ర ప్రభుత్వం సడలించడంతో జైలులో ఉన్న ఖైదీలు, అండర్ ట్రయల్ నిందితులను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలోనే షారూఖ్ ఖాన్ కూడా ఇవాళ ఉదయం తన కుమారుడు ఆర్యన్‌ను కలిసేందుకు జైలుకు వెళ్లారు. జైలు ప్రవేశ ద్వారం వద్ద ఆధార్ కార్డు, ఇతర పత్రాలు చూపించి లోపలికి వెళ్లారు షారూఖ్ ఖాన్. సాధారణ పౌరుడిలానే జైలు క్యాబినెట్‌లో తన తనయుడిని కలిశారు షారూఖ్. ఆర్యన్ ఖాన్‌ను ఎన్సీబీ అరెస్ట్ చేసిన తర్వాత షారూఖ్ తన కుమారుడిని కలవడం ఇదే మొదటిసారి.

Ads : యాడ్స్ వల్ల ట్రోల్ల్స్ కి గురవుతున్న సెలెబ్రిటీలు

జైలు నిబంధనల ప్రకారం ఇద్దరు నేరుగా కలవడానికి వీల్లేదు. గాజు గోడకు ఇవతల ఒకరు, అవతల ఒకరు నిలబడి ఒకరినొకరు చూసుకుంటూ ఫోన్ లో మాట్లాడారు. దాదాపు 10 నిమిషాల పాటు ఇద్దరు మాట్లాడుకున్నారు. తండ్రిని చూసి ఆర్యన్ ఖాన్ భావోగ్వానికి గురయి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అలాగే కొడుకుని చూసి షారూఖ్ ఖాన్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. అంతా మంచే జరుగుతుంది, ధైర్యంగా ఉండమని తన కుమారుడికి షారుఖ్ చెప్పినట్టు తెలుస్తుంది.

Prabhas : ప్రభాస్ సిగ్గుపడతాడు.. కాని కుదిరినప్పుడల్లా డిన్నర్ కి పిలుస్తాడు

ముంబై స్పెషల్ కోర్టు తీర్పుపై ఆర్యన్ ఖాన్ లాయర్ హైకోర్టు అప్పీల్‌కు వెళ్లారు. బాంబే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై అక్టోబరు 23న హైకోర్టు విచారించనుంది. ఈ సారైనా ఆర్యన్ కి బెయిల్ వస్తుందా లేక ఎన్సీబీ మరిన్ని ఆధారాలు సేకరిస్తుందా చూడాలి.