Parliamentary Panel : మోదీ ట్విట్టర్ హ్యాక్..అధికారులను ప్రశ్నించిన శశిథరూర్ కమిటీ

కాంగ్రెస్ నేత శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్​కు గురికావడంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత శాఖ

Parliamentary Panel : మోదీ ట్విట్టర్ హ్యాక్..అధికారులను ప్రశ్నించిన శశిథరూర్ కమిటీ

Tharoor

Parliamentary Panel : కాంగ్రెస్ నేత శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్​కు గురికావడంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత శాఖ ఉన్నతాధికారులను సోమవారం ప్రశ్నించింది. అయితే మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ గురించీ అధికారులు సమాచారం ఇవ్వలేదని మాచారం. దీని వివరాలు ఇప్పటికే పబ్లిక్ డొమైన్​లో అందుబాటులో ఉన్నాయని చెప్పినట్లు తెలుస్తోంది.

కాగా,ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కొద్దిసేపు హ్యాక్‌కు గురైంది. భారతదేశం బిట్‌ కాయిన్‌ను అధికారికంగా చట్టబద్ధమైన బిడ్‌గా స్వీకరించిందని పేర్కొంటూ ప్రధాని వ్యక్తిగత ఖాతాలో హ్యాకర్‌ ఒక ట్వీట్‌ చేశారు. భారతదేశం అధికారికంగా 500 బిట్‌కాయిన్‌లను కొనుగోలు చేసింది. వాటిని మనదేశంలో నివసించే వారికి పంపిణీ చేస్తోంది అని మరో పోస్ట్‌ చేశారు. అయితే దాన్ని కొంతసేపటి తర్వాత ట్విటర్‌ యాజమాన్యం పునరుద్ధరించింది.

దీనిని ట్విట్టర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఆ ట్వీట్‌ను తొలగించారని ప్రధాని కార్యాలయం పేర్కొంది. భారత ప్రభుత్వం.. క్రిప్టోకరెన్సీలపై బిల్లును ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతున్న సమయంలో ఇలా జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కొందరు ఆగంతకులు తప్పుడు వాగ్దానాలతో పెట్టుబడులను ఆకర్షించేందుకు క్రిప్టో కరెన్సీలను ఉపయోగించుకుని, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులను మళ్ళించే అవకాశం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.

ఇక, శశిథరూర్ నేతృత్వంలోని స్థాయీసంఘం.. పెగసస్ అంశంపైన కూడా ఇవాళ అధికారులకు ప్రశ్నలు సంధించింది. పెగసస్ స్పైవేర్​ను ఉపయోగించి ఫోన్లను హ్యాక్ చేస్తున్నారనే అంశంపై థరూర్ ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఈ విషయం న్యాయస్థానం పరిధిలో ఉందని అధికారులు బదులిచ్చినట్లు వెల్లడించాయి. తమకు సహకరించాలని థరూర్ కోరినప్పటికీ.. అధికారులు వివరాలేవీ వెల్లడించలేదని పేర్కొన్నాయి. పెగసస్​పై చెప్పాల్సింది ఏమీ లేదంటూ తప్పించుకున్నారని వివరించాయి.

ALSO READ Cremation Ashes Jewellery: అస్థికలతో తయారు చేసిన నగలకు ఫుల్ డిమాండ్