Hyderabad: స్థల వివాదం విషయంలో ఇస్మాయిల్‌పై కాల్పులు.. నిందితుల కోసం పోలీసుల గాలింపు..

హైదరాబాద్ మాదాపూర్ పరిధిలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఓ స్థలం విషయంలో ఇద్దరు రౌడీషీటర్ ల మధ్య ఘర్షణ తలెత్తడంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇస్మాయిల్ మృతిచెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Hyderabad: స్థల వివాదం విషయంలో ఇస్మాయిల్‌పై కాల్పులు.. నిందితుల కోసం పోలీసుల గాలింపు..

Hyderabad (1)

Hyderabad: హైదరాబాద్ లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారు జామున నగరంలోని మాదాపూర్ ప్రాంతంలోని నీరూస్ సిగ్నల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకోవటం స్థానిక ప్రజలను ఒక్కసారిగా కలవరానికి గురిచేసింది. ఈ కాల్పుల్లో ఇస్మాయిల్ రౌడీషీటర్ మృతిచెందాడు. మరో వ్యక్తి జహంగీర్ కు తీవ్రగాయాలయ్యాయి. ఇస్మాయిల్ పై పాయింట్ బ్లాంక్ లో కాల్పులు జరపడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

Chikoti Praveen: నేడు ఈడీ ముందుకు చీకోటి ప్రవీణ్ గ్యాంగ్.. కీలక వివరాలు సేకరించనున్న అధికారులు

ఇస్మాయిల్, జహంగీర్, మహ్మద్ ల మధ్య రియల్ ఎస్టేట్ వివాదం నడుస్తుంది. ఓ స్థల వివాదం విషయంలో వీరి మధ్య కొద్దికాలంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే వివాదాన్ని పరిష్కరించుకునేందుకు నీరూస్ దగ్గరికి ఇస్మాయిల్, జహంగీర్ లను మహ్మద్ పలిచాడు. మహ్మద్, ఇస్మాయిల్ ల మధ్య చర్చలు జరుగుతున్న క్రమంలోనే మహ్మద్ గన్ తో ఫైరింగ్ చేసినట్లు తెలిసింది. ఇస్మాయిల్ పక్కనే ఉన్నవారిని చదరగొట్టేందుకు మరో గన్ తో జిలానీ సైతం కాల్పుడు జరిపాడు. మహ్మద్, జిలానీ జరిపిన కాల్పుల్లో ఇస్మాయిల్ కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో మిత్రులు అతన్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇస్మాయిల్ మరణించాడు.

Monkeypox: మంకీపాక్స్ లక్షణాలతో కేరళవాసి మృతి

తీవ్ర గాయాలైన జహంగీర్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఓ స్థలానికి సంబంధించి మహ్మద్, ఇస్మాయిల్ మధ్య వివాదం జరగడంతో కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితులు మహ్మద్, జిలానీలు పరారీలో ఉన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న సైబరాబాద్ పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. సీపీ ఆదేశాల మేరకు ఐదు టీంలు ఏర్పాటు చేసి నిందితుల కోసం ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి.