#BorderGavaskarTrophy: శ్రేయాస్ వచ్చేస్తున్నాడు.. రెండో టెస్ట్ మ్యాచ్ స్వాడ్ లో అయ్యర్

టీమిండియా స్టార్ మిడిల్-ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి కోలుకున్నాడు. ఢిల్లీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ నెల 17 నుంచి జరగనున్న రెండో టెస్టు మ్యాచులో భారత్ స్వాడ్ తో అతడు చేరనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది.

#BorderGavaskarTrophy: శ్రేయాస్ వచ్చేస్తున్నాడు.. రెండో టెస్ట్ మ్యాచ్ స్వాడ్ లో అయ్యర్

Shreyas

#BorderGavaskarTrophy: టీమిండియా స్టార్ మిడిల్-ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి కోలుకున్నాడు. ఢిల్లీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ నెల 17 నుంచి జరగనున్న రెండో టెస్టు మ్యాచులో భారత్ స్వాడ్ తో అతడు చేరనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది.

“భారత బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ నేషనల్ క్రికెట్ అకాడమీలో వెన్నునొప్పికి చికిత్స తీసుకుని కోలుకున్నాడు. అతడు ఆడవచ్చని బీసీసీఐ వైద్య బృందం స్పష్టం చేసింది” అని బీసీీసీఐ పేర్కొంది. శ్రేయాస్ అయ్యర్ నెలరోజులుగా క్రికెట్ ఆడడం లేదు. నేరుగా ఇప్పుడు అతడు టెస్టు మ్యాచు ఆడే అవకాశం వచ్చింది. మరోవైపు, ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఇవాళ ఢిల్లీకి చేరుకుంది.

భారత్-ఆస్ట్రేలియా మధ్య మొత్తం నాలుగు టెస్టు మ్యాచులు జరగనున్నాయి. మొదటి టెస్టులో భారత్ చేతిలో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్, 132 పరుగుల తేడాతో అవమానకరరీతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను ఆసీస్ వెనక్కి పిలిపిస్తున్నట్లు సమాచారం. వార్నర్ స్థానంలో ఆల్ రౌండర్ ట్రావిస్ మైఖేల్ హెడ్ ను రెండో టెస్టు మ్యాచులో తీసుకునే అవకాశం ఉంది.

Women’s Premier League: షెడ్యూల్ వచ్చేసింది.. మార్చి 4న గుజరాత్-ముంబై మధ్య తొలి మ్యాచ్