Shruti Haasan: ప్రభాస్ సీక్రెట్స్‌ను బట్టబయలు చేస్తున్న శృతి హాసన్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ‘సలార్’ కూడా ఒకటి. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో....

Shruti Haasan: ప్రభాస్ సీక్రెట్స్‌ను బట్టబయలు చేస్తున్న శృతి హాసన్..?

Shruti Haasan To Dig Into Prabhas In Salaar

Shruti Haasan: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ‘సలార్’ కూడా ఒకటి. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో సలార్ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండగా, ఈ చిత్రంలో అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె పాత్ర ఈ సినిమాలో చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.

Salaar: బాప్ రే.. సలార్ ఓటీటీ రైట్స్ కోసం రూ.200 కోట్ల ఆఫర్?

అయితే తాజాగా ఈ సినిమాలో శృతి చేయబోయే పాత్రకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. సలార్ చిత్రంలో శృతి హాసన్ ‘ఆద్యా’ అనే పాత్రలో నటిస్తోంది. అయితే ఆమె ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతుందట. ప్రభాస్ ఫ్లాష్‌బ్యాక్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఆమె బట్టబయలు చేసే పనిలో ఉంటుందట. అయితే ఇక్కడే హీరోకు సంబంధించిన కొన్ని నిజాలు తెలుసుకుని, అతడితో ప్రేమలో పడుతుందట ఈ బ్యూటీ.

ఇలా ప్రభాస్ ఫ్లాష్‌బ్యాక్‌కు సంబంధించిన పూర్తి వివరాలను బయటకు లాగేందుకు శృతి ప్రయత్నిస్తుందట. అంతేగాక, ఈ సినిమాలో కొన్ని హైవోల్టేజ్ యాక్షన్ సీన్స్‌లోనూ ఈ అమ్మడు తన సత్తా చాటనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ మాస్ లుక్‌లో కనిపిస్తుండగా, ఆయన పాత్రను చాలా పవర్‌ఫుల్ గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రయత్నిస్తున్నాడు.

Salaar: సలార్ కూడా రెండు పార్టులా.. నీల్ ప్లాన్ ఏంటి?

పూర్తిగా యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రానున్న సలార్ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ మూవీ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, విలక్షణ నటుడు జగపతి బాబు ‘రాజమనార్’ పాత్రలో నటిస్తున్నాడు. నటి ఈశ్వరి రావు ప్రభాస్ తల్లిగా మనకు కనిపిస్తారు. హొంబాలే ఫిలింస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు రవి బసూర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.