six seater bicycle : ఆ సైకిల్ పై ఒకేసారి ఆరుగురు షికారు చేయచ్చు.. రాజస్థాన్ రోడ్లపై ఆకట్టుకుంటున్న కొత్త మోడల్

సైకిల్ అంటే అందరికీ ఇష్టమే కదా .. ఆరు సీట్ల సైకిల్ చూస్తే ఫిదా అయిపోతారు. మీరే కాదు మీ ఫ్రెండ్స్ అందరూ ఒకేసారి రైడ్‌కి వెళ్లచ్చు.. ఎక్కడో చూడాలని ఉందా?

six seater bicycle : ఆ సైకిల్ పై ఒకేసారి ఆరుగురు షికారు చేయచ్చు.. రాజస్థాన్ రోడ్లపై ఆకట్టుకుంటున్న కొత్త మోడల్

six seater bicycle

six seater bicycle : సైకిల్ తొక్కడం అంటే అందరికీ ఇష్టమే. ఈ మధ్య కాలంలో ఆరోగ్య రీత్యా కూడా చాలామంది సైకిల్ తొక్కడానికి ఇష్టపడుతున్నారు. సైకిల్‌పై మహా అయితే ఇద్దరం ఎక్కగలం.. కానీ ఆరుగురు ఎక్కగలిగే సైకిల్ ని మీరు చూసారా?

2021 మారుతి సుజుకీ కొత్త మోడల్ కారు వచ్చేసింది.. ఇండియాలో ధర ఎంతో తెలుసా?

ఫిట్‌నెస్‌లో భాగంగా సైకిల్ తొక్కడం అనేది ఇప్పుడు భాగమైంది. ఆరోగ్యరీత్యా చాలామంది సిటీల్లో సైక్లింగ్ ఇష్టపడుతున్నారు. రకరకాల మోడళ్లలో సౌకర్యవంతమైన సైకిళ్లు ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. అయితే కొత్త మోడల్ ఏదైనా వస్తే జనం దానివైపు మొగ్గు చూపడం కామనే కదా.. అయితే ఆరుగురు కూర్చునే వీలున్న పొడవైన సైకిల్ ఇప్పుడు రాజస్ధాన్ రోడ్డలపై హల్ చల్ చేస్తోంది. సందీప్ ప్రజాపతి అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఈ సైకిల్ కి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ సైకిల్ ఓ చోటకి వచ్చి ఆగుతుంది. ఆగిన చోట మరో వ్యక్తి దానిపై కూర్చుంటారు. చూసేవాళ్లంతా ఈ కొత్త మోడల్ చూసి భలే ఉందని ఆశ్చర్యపోతున్నారు.

Best Laptops in April : కొత్త ల్యాప్‌టాప్ కావాలా? ఈ నెలలో రూ. 50వేల లోపు 5 బెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. మీకు నచ్చిన మోడల్ కొనేసుకోండి..!

ఈ సైకిల్ ఎంత ఉపయోగకరంగా ఉంటుందని కొందరు.. ఈ వీడియో సమాజంలో సరికొత్త మార్పును తీసుకురాబోతోంది అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ సైకిల్ నిజంగానే చాలా ఉపయోగకరంగా అనిపిస్తోంది. చాలామంది ఒకేసారి రైడ్ కి వెళ్లడానికి వీలుంది. మరి అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం వస్తుందేమో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Sandeep Prajapti Sandeep Prajapti (@offical_sandeep_bdt23)