Hollywood : ఇండియా మీద హాలీవుడ్ దండయాత్ర.. భయపడుతున్న బాలీవుడ్..

గత కొన్నేళ్లుగా ఇండియన్ సినిమాపై హాలీవుడ్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతీ సారి మూవీ మార్కెట్ ని దేశ వ్యాప్తంగా ప్రభావితం చేస్తోంది. మార్వెల్, డిస్నీ, వార్నర్ బ్రదర్స్ వంటి హాలీవుడ్ నిర్మాణ కంపెనీల ప్రాజెక్టులకు......................

Hollywood : ఇండియా మీద హాలీవుడ్ దండయాత్ర.. భయపడుతున్న బాలీవుడ్..

Hollywood Movies

Bollywood :  అసలైన ఆట మొదలైంది. హాలీవుడ్ మోస్ట్ అవైటైడ్ సినిమాల దండయాత్ర ముందు ముందు భీకరంగా ఉండనుంది. ఇండియన్ మార్కెట్ పై విపరీతమైన ప్రభావం చూపించే హాలీవుడ్ పక్కా స్కెచ్ తో ఒక్కో ప్రాజెక్టును రెడీ చేస్తోంది. అయితే ఈసారి సూపర్ సక్సెస్ ల సీక్వెల్స్ హడావిడీ ఎక్కువకావడంతో ముఖ్యంగా బాలీవుడ్ మరింత భయపడుతుంది.

గత కొన్నేళ్లుగా ఇండియన్ సినిమాపై హాలీవుడ్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతీ సారి మూవీ మార్కెట్ ని దేశ వ్యాప్తంగా ప్రభావితం చేస్తోంది. మార్వెల్, డిస్నీ, వార్నర్ బ్రదర్స్ వంటి హాలీవుడ్ నిర్మాణ కంపెనీల ప్రాజెక్టులకు ఇండియన్ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ వుంది. ఆ క్రేజ్ కారణంగా వాటిని ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ చేసి వదలడంతో అవి ప్రతీ సీజన్ లోనూ మన సినిమాలకు గట్టి పోటీ ఇస్తూనే ఉన్నాయి. కొన్ని కొన్ని సార్లు బడా ఇండియన్ సినిమాలు సైతం బాక్సాఫీస్ వసూళ్లని హాలీవుడ్ సినిమాలతో షేర్ చేసుకోవాల్సి వస్తోంది.

గతేడాది కొవిడ్ నుంచి కాస్త రిలాక్సేషన్ దొరికాక స్పైడర్ మ్యాన్ – నో వే హోమ్ వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకొచ్చి సంచలనాన్ని సృష్టించింది. పుష్ప, 83 సినిమాల మార్కెట్ పై స్పైడర్ మ్యాన్ ఎఫెక్ట్ చూపించాడు. లాంగ్ రన్ లో ఇండియాలో 300 కోట్లకు పైగానే స్పైడర్ మ్యాన్ రాబట్టాడు. అంతకుముందు సూర్యవంశీ లాంటి సినిమాలపై షాంగ్ చీ, ఎటర్నల్స్ వంటి హాలీవుడ్ ప్రాజెక్ట్స్ గట్టి దెబ్బే కొట్టాయి.

స్పైడర్ మ్యాన్ అంత కాదు కానీ రాబర్ట్ పాటిన్ నస్ బ్యాట్ మ్యాన్ గా వచ్చి కొంత వరకు వసూళ్లు రాబట్టాడు. అయితే ఈ హాలీవుడ్ సినిమాల కారణంగా ఎక్కువగా నష్టపోతుంది బాలీవుడ్. లేటెస్ట్ రిలీజ్ ది డాక్టర్ స్ట్రేంజ్ 2 బజ్ కూడా నార్త్ లోనే ఎక్కువగా ఉంది. మార్వెల్ సినిమాలకు కొనసాగింపుగా వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్ కూడా బాగానే రాబట్టింది. స్టోరీ లైన్, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతాయని బెనెడిక్ట్ కంబర్‌ బ్యాచ్ ప్రమోషన్స్ లో చెప్పినట్టే చేసి చూపించారు.

రెండేళ్ల నుంచి మిస్ అయిన హంగామాని చూపించబోతున్నారు హాలీవుడ్ స్టార్ హీరోలు. బరిలోకి దిగితే ఎలాఉంటుందో ఆల్రెడీ టామ్ క్రూజ్ చూపించేస్తున్నాడు. ఈ సమ్మర్ నుంచి మొదలుపెట్టి ఇయర్ ఎండ్ వరకూ అన్ బిలీవబుల్ యాక్షన్, గ్రాఫిక్స్, ఎలివేషన్ తో సరికొత్త ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వబోతోంది హాలీవుడ్. డాక్టర్ స్ట్రేంజ్, టాప్ గన్ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ టాప్ మూవీస్ తో ఈ బజ్ కంటిన్యూ అవ్వబోతోంది. యాక్షన్ లవర్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టాప్ గన్ మెవరిక్ మూవీ మే 27న రిలీజ్ అయింది. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ తో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న టామ్ క్రూజ్ ఈ హై ఇంటెన్స్ యాక్షన్ టాప్ గన్ సీక్వెన్స్ తో జోరు చూపించాడు. 36 ఏళ్ల తర్వాత 12 వందల కోట్ల బడ్జెట్ తో తీసుకొచ్చిన టాప్ గన్ సీక్వెల్ కూడా నార్త్ లో గట్టి వసూళ్లనే రాబడుతోంది. మొదటి నాలుగు రోజుల్లో 156 మిలియన్ డాలర్లను సాధించి 40 ఏళ్ల టామ్ క్రూజ్ కెరీర్ లోనే హైయెస్ట్ రికార్డ్ కొట్టింది. ఇక టామ్ క్రూజ్ మిషన్‌: ఇంపాజిబుల్‌ ఫ్రాంఛైజీలో రాబోతున్న ఏడో మూవీ 2023 జూలై 18కి ఫోకస్ షిఫ్ట్ చేసింది.

జురాసిక్‌ పార్క్‌ సినిమా సిరీస్‌లో ఆరో భాగంగా వస్తున్న మూవీ జురాసిక్‌ వరల్డ్‌ : డొమినియన్‌. ఈ మూవీ 2022 జూన్‌ 10న రిలీజ్‌ కాబోతోంది. చివరిసారి 2018లో వచ్చిన జురాసిక్‌ వరల్డ్‌ : ఫాలెన్‌ కింగ్‌ డమ్‌కు ఇది సీక్వెల్‌. ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది జురాసిక్ వరల్డ్ ట్రైలర్. క్రిస్ ప్రాట్ లీడ్ రోల్ లో కోలిన్ ట్రివోర్ డైరెక్షన్లో తెరకెక్కింది ఈ సినిమా. జూలైలో సూపర్ హీరో థోర్.. లవ్ అండ్ థండర్ కాన్సెప్ట్ తో వస్తున్నాడు. ద మోస్ట్ అవెయిటింగ్ థోర్ మూవీగా జులై 8న రిలీజ్ కాబోతోంది. మార్వెల్ సూపర్ హీరో సినిమాల్లో ఎంతో ప్రత్యేకం అనిపించుకుంది బ్లాక్ పాంథర్. 2018లో వచ్చిన ఈ ప్రాజెక్ట్ బాక్స్ ఆఫీస్ షేక్ చేసే వసూళ్లను అందుకుంది. దీంతో దానికి కొనసాగింపుగా మరో మూవీని నిర్మించారు. బ్లాక్ ఫాంథర్ – వకండా ఫరేవర్ గా వస్తున్న న్యూ ప్రాజెక్ట్ నవంబర్ 11న విడుదల కానుంది. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే హీరో చద్విక్ బొస్మాన్ కాన్సర్ తో మృతి చెందారు. ఈయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

Movies : మూడు సినిమాలు.. మూడు పరిశ్రమలు.. టాక్ ఏంటి??

వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ను చిన్న టీజర్ తోనే బుట్టలో పడేసింది అవతార్ 2. పండోరాను మించిన అందాలు, నీటి లోతుల్లో ఫ్యామిలీతో హీరో జేక్ చేసే విన్యాసాలు, మానవులతో మళ్లీ యుద్ధం, కేట్ విన్స్ లెట్ లాంటి యాక్టర్ల స్పెషల్ అట్రాక్షన్… ఇలా విజువల్ వండర్ కాన్సెప్ట్ తో అవతార్ సీక్వెల్ ను రెడీ చేసారు డైరెక్టర్ జేమ్స్ కామరూన్. డిసెంబర్ 16న 160 భాషల్లో అవతార్2ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. అంతా బాగానే ఉంది కానీ అవతార్ వస్తున్నాడంటే బాలీవుడ్ దర్శకనిర్మాతకు చెమటలు పడుతున్నాయి. 2009లో విడుదలైన అవతార్ ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టించింది. ఇక రీసెంట్ గా వచ్చిన అవతార్2 ట్రైలర్ ఇప్పటికే అంచనాలు పెంచేసింది. స్పైడర్ మ్యాన్ సినిమాలకు ఆదరణ ఎంతలా ఉంటుందో తెలిసిందే. దీంతో ఆ కథల్లో కొన్నిటిని యానిమేషన్ చిత్రాలుగా తీసుకొచ్చారు. 2018లో వచ్చిన స్పైడర్ మ్యాన్ ఇన్ టు స్పైడర్ వర్స్ మూవీ పెద్ద హిట్ గా నిలిచింది. దీంతో ఈ యానిమేటెడ్ సిరీస్ కు కొనసాగింపుగా ఇప్పుడు స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వర్స్ మూవీని 2023 జూన్ లో రానుంది.