Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. తల్లికి తోడుగా ఉన్న కూతురు ప్రియాంకా గాంధీ

రాహుల్ గాంధీ ఈ యాత్రకు బయల్దేరిన తర్వాత నుంచి ఆమె స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్‌తో సోనియా గాంధీ బాధ పడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా, సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని కర్ణాటక మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఆకాంక్షించారు.

Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. తల్లికి తోడుగా ఉన్న కూతురు ప్రియాంకా గాంధీ

Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం ఆస్పత్రిలో చేరారు. న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో ఆమె చేరినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సోనియా గాంధీ ఆరోగ్య స్థితిని ఆమె కూతురు ప్రియాంకా గాంధీ పర్యవేక్షిస్తున్నారు.

Chennai: ట్రక్కు కింద పడి మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి.. స్కూటీపై నుంచి గుంతలో పడటంతో దారుణం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ రెండో దశ మంగళవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ ఈ యాత్రకు బయల్దేరిన తర్వాత నుంచి ఆమె స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్‌తో సోనియా గాంధీ బాధ పడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా, సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని కర్ణాటక మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఆకాంక్షించారు. సోనియా గాంధీ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

ముఖ్యంగా కోవిడ్ సోకినప్పటి నుంచి ఆమె వరుసగా అనేక అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. పలుసార్లు అనారోగ్యం పాలైన నేపథ్యంలో విదేశాల్లో కూడా చికిత్స తీసుకుని వచ్చారు. ప్రస్తుతం సోనియా ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.