South Heroins: కాస్త గ్యాప్ ఇచ్చి బీటౌన్‌లో వాలిపోతున్న సౌత్ భామలు

వరుసగా తెలుగు సినిమాల్లో మెరిశారు.. ఇక్కడ హిట్ కొట్టారు.. ఆ సక్సెస్ ప్రొఫైల్ చూపించి బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. పాన్ ఇండియా హీరోయిన్లు అనిపించుకుంటున్నారు. అయితే సౌత్ లో ఈ బ్యూటీస్ బ్రేక్ ఇవ్వబోతున్నారు.

South Heroins: కాస్త గ్యాప్ ఇచ్చి బీటౌన్‌లో వాలిపోతున్న సౌత్ భామలు

South Heroins (1)

South Heroins: వరుసగా తెలుగు సినిమాల్లో మెరిశారు.. ఇక్కడ హిట్ కొట్టారు.. ఆ సక్సెస్ ప్రొఫైల్ చూపించి బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. పాన్ ఇండియా హీరోయిన్లు అనిపించుకుంటున్నారు. అయితే సౌత్ లో ఈ బ్యూటీస్ బ్రేక్ ఇవ్వబోతున్నారు. నార్త్ లో కాస్త సందడి చేశాకే ఇక్కడి ఫ్యాన్స్ ముందుకు వస్తామంటున్నారు. క్రేజీ గర్ల్స్ పూజా, రష్మిక చెప్తోన్న కొత్త కబుర్లపై హావ్ ఎ లుక్.

South Heroins: సౌత్‌కు గుడ్ బై.. బాలీవుడ్‌పైనే గంపెడు ఆశలు!

ఆచార్యలో స్పెషల్ రోల్.. ఎఫ్3లో స్పెషల్ సాంగ్.. ఆ తర్వాత టాలీవుడ్ లో ఈ సీజన్ కు బైబై చెప్పబోతుంది పూజా హెగ్డే. తన మూవీ క్యాలెండర్ లో టాలీవుడ్ కోసం ఇచ్చిన డేట్స్ పూర్తయ్యాయి. సినిమాలు వెంటవెంటనే ప్రేక్షకుల ముందుకొచ్చేస్తున్నాయి. ఇక బాలీవుడ్ సినిమాలతో మాత్రమే ఆమె ప్రస్తుతం బిజీ కానుంది. రణ్ వీర్ సింగ్ తో చేస్తోన్న సర్కస్ జూలైలో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ మూవీ కోసం ఆమె వర్క్ చేయాల్సి ఉంది. ఇక ఇదే ఇయర్ రిలీజ్ కాబోతున్న సల్మాన్ ఖాన్ కభీ ఈద్ కభీ దివాలీ కోసం కూడా పూజా బల్క్ డేట్స్ ఇచ్చింది. మే 15 నుంచి రీస్టార్ట్ కాబోతున్న సల్మాన్ మూవీ కోసం బుట్టబొమ్మ బ్రేక్ లేకుండా పని చేయబోతుంది.

South Heroins: టార్గెట్ బాలీవుడ్.. సౌత్ గర్ల్స్ అడ్డాగా మారిన బీటౌన్!

టాలీవుడ్ లో మహేశ్ బాబు, త్రివిక్రమ్ మూవీలో పూజా కన్ఫర్మ్. పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ ప్రాజెక్ట్ లోనూ హీరోయిన్ బుట్టబొమ్మే. సో ఇద్దరు స్టార్స్ సినిమాలను ముందే బుక్ చేసుకున్న ఈ హీరోయిన్ మళ్లీ ఈ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. అయితే ఇవి సెట్స్ పైకెళ్లాలి. షూటింగ్ పూర్తి చేసుకోవాలి. అంతవరకు నార్త్ లోనే పూజా ఆటలు సాగబోతున్నాయి.

South Heroins: ముదురు భామలు.. కానీ పెళ్లికేముంది తొందర!

రష్మిక కూడా సౌత్ లో గ్యాప్ ఇస్తోంది. రష్మికను ఇక్కడ చూడాలంటే పుష్ప2, విజయ్-వంశీ పైడిపల్లి, దుల్కర్ సీతారామం రిలీజ్ కావాల్సిందే. పుష్ప2 షూటింగ్ లేట్ అవుతోంది. రెండో భాగాన్ని మరింత గ్రాండ్ గా తీయాలనే ఉద్దేశ్యంతో సుకుమార్ అమెరికా వెళ్లి ఎలివేషన్ సీన్స్ రాసుకుంటున్నారు. వంశీ పైడిపల్లి, విజయ్ సినిమా ఈమధ్యే పట్టాలెక్కింది. ఒక వేళ వస్తే దుల్కర్ మూవీతోనే రష్మిక ఇక్కడి వారికి మరోసారి హాయ్ చెప్తుంది. అయితే గ్లామరస్ హీరోయిన్ గా కాదు.. ఇంటెన్స్ క్యారెక్టర్ లో మాత్రమే.

South Movies: బాలీవుడ్‌ను వెంటాడుతున్న సౌత్.. సైడ్ ఇచ్చేస్తున్న బీటౌన్!

సిద్ధార్ధ్ మల్హోత్రాతో నేషనల్ క్రష్ నటిస్తోన్న మిషన్ మజ్ను జూన్ 10న రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ తో ఆమె నటిస్తోన్న గుడ్ బై ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతమైతే రణ్ బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్టార్ట్ అయిన యానిమల్ కోసం బల్క్ డేట్స్ ఇచ్చేసింది రష్మిక. కొన్ని నెలల పాటూ యానిమల్ కోసం ఆమె ముంబైలోనే ఉండబోతుంది. ఆ తర్వాతే పుష్ప2, విజయ్ మూవీ కోసం మళ్లీ సౌత్ కి తిరిగొస్తుంది.