Sreeleela : ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎలా ఉండాలో చెప్పిన శ్రీలీల.. తెలుగు హీరోయిన్స్ పై కామెంట్స్..

శ్రీలీల నిజానికి యంగ్ హీరోయిన్ అయినా అనుకున్న దానికన్నా వచ్చిన స్టార్ డమ్ ని బాగా హ్యాండిల్ చేస్తోంది. అప్పుడే చిన్న సినిమాలకు చీఫ్ గెస్ట్ గా వెళ్లి వాళ్లని కూడా ఎంకరేజ్ చేస్తోంది. రాబోయే హీరోయిన్స్ కి సలహాలిస్తుంది.

Sreeleela : ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎలా ఉండాలో చెప్పిన శ్రీలీల.. తెలుగు హీరోయిన్స్ పై కామెంట్స్..

Sreeleela comments on Tollywood and Telugu Heroins

Sreeleela : బ్యూటీ విత్ బ్రెయిన్ శ్రీలీలకి ఈ లైన్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లకి కూడా లేనంత క్రేజ్ తెచ్చుకుని ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ అయిపోయింది. 22 ఏళ్ల ఈ యంగ్ హీరోయిన్ అసలు హీరోయిన్లు ఎలా ఉండాలో చెబుతోంది. 22 ఏళ్లైనా తెలుగు నుంచి సౌత్ వరకూ అన్ని ఇండస్ట్రీల్లో హైలెట్ అవుతోంది శ్రీలీల. వరసగా 10 సినిమాలు చేస్తూ హీరోలకు మోస్ట్ వాంటెడ్ అయిపోయింది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూనే మరో వైపు మెడిసిన్ చదువుతున్న శ్రీలీల అప్ కమింగ్ హీరోయిన్లకి సలహాలిస్తోంది.

శ్రీలీల నిజానికి యంగ్ హీరోయిన్ అయినా అనుకున్న దానికన్నా వచ్చిన స్టార్ డమ్ ని బాగా హ్యాండిల్ చేస్తోంది. అప్పుడే చిన్న సినిమాలకు చీఫ్ గెస్ట్ గా వెళ్లి వాళ్లని కూడా ఎంకరేజ్ చేస్తోంది. రాబోయే హీరోయిన్స్ కి సలహాలిస్తుంది. లేటెస్ట్ గా ఓ సినిమా ఈవెంట్ లో హీరోయిన్స్ కెరీర్ గురించి క్లారిటీ ఇచ్చింది. ఇటీవల సంజయ్, ప్రణవి జంటగా నటించిన స్లమ్ డాగ్ హస్బెండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు శ్రీలీల గెస్ట్ గా వచ్చింది. ఈ ఈవెంట్ లో ప్రణవి శ్రీలీలని హీరోయిన్స్ గా ఇండస్ట్రీలో ఎలా ముందుకెళ్లాలి, ఎలాంటి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి అంటూ పలు ప్రశ్నలు అడిగిందట. వాటితో పాటు తెలుగు హీరోయిన్స్ పై కూడా శ్రీలీల ఈ ఈవెంట్ లో కామెంట్స్ చేసింది.

శ్రీలీల మాట్లాడుతూ.. అల్లు అర్జున్ సర్ ఇటీవల చెప్పినట్టు తెలుగు అమ్మాయిలు ఇంకా రావాలి. మొన్న వైష్ణవి, ఇప్పుడు ప్రణవి.. ఇలా చాలా మంది ఇండస్ట్రీకి రావాలి. ఇండస్ట్రీ అనేది ఒక డిగ్నిఫైడ్ జాబ్. మా ఫ్యామిలీలో అంతా చదువు వైపే, నేను చదువుకుంటూ ఒక్కసారిగా సినిమాల్లోకి వచ్చాను. ఇది చాలా బోల్డ్ స్టెప్. ఇక్కడికి అందరూ ధైర్యంగా రావాలి, మనల్ని ఎవరూ ఆపరు. డిగ్నిఫైడ్ గా ఉండి, మన బౌండరీల్ని కరెక్ట్ గా సెట్ చేసుకుంటే మనకు అసలు ఎలాంటి ప్రాబ్లమ్ రావు అని తెలిపింది

Bro Movie : ‘బ్రో’తో హ్యాట్రిక్ కొట్టిన పవర్ స్టార్.. థియేటర్స్‌లో ప్రతి సీన్‌కి అరుపులే..

శ్రీలీల స్పీచ్ కి ఫుల్ ఫిదా అయిపోయారు జనాలు. ఎప్పుడూ ఫుల్ ఎనర్జిటిక్ గా ఉండే శ్రీలీల యంగ్ హీరోయిన్స్ కి ఇలా సజెషన్స్ ఇస్తూ అప్ కమింగ్ యాక్ట్రెస్ ని ఎంకరేజ్ చేస్తోంది. ఖాళీ లేకుండా వరసగా సినిమాలతో బిజీగా ఉన్నశ్రీలీల యంగ్ ఏజ్ లోనే ఇంత మెచ్యుర్డ్ గా మాట్లాడుతోందని అభిమానులు, ప్రేక్షకులు తెగ ఇంప్రెస్ అయిపోతున్నారు. ఇప్పటికే తన డ్యాన్స్, నటన, అందంతో మెప్పించిన శ్రీలీల ఇప్పుడు తన మాటలతో కూడా మెప్పించింది. ఇక ప్రస్తుతం శ్రీలీల అన్ని ఇండస్ట్రీల్లో కలిపి దాదాపు 10 సినిమాలకు పైనే చేస్తోంది. స్టార్ హీరోయిన్లకు కూడా చెక్ పెట్టి అవకాశాలు సంపాదిస్తోంది శ్రీలీల. అందుకే శ్రీలీలని బ్యూటీ విత్ బ్రెయిన్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు జనాలు.