Stalin’s Gym Video: జిమ్‌లో సీఎం స్టాలిన్.. 68ఏళ్ల వయసులో ఫిట్‌‌గా వర్కౌట్స్!

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఏమాత్రం అశ్రద్ధ చెయ్యట్లేదు. తన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు సీఎం అయ్యాక కూడా స్టాలిన్ వ్యాయామం పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

Stalin’s Gym Video: జిమ్‌లో సీఎం స్టాలిన్.. 68ఏళ్ల వయసులో ఫిట్‌‌గా వర్కౌట్స్!

Stalin

Stalin’s Gym Workout: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఏమాత్రం అశ్రద్ధ చెయ్యట్లేదు. తన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు సీఎం అయ్యాక కూడా స్టాలిన్ వ్యాయామం పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. లేటెస్ట్‌గా సీఎం స్టాలిన్ వర్క్‌ఔట్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టాలిన్ యూత్ సెక్రటరీగా ఉన్న కాలంలో మరియు అంతకు ముందు కూడా ఉదయం నడవడం, ప్రజల నుండి పిటిషన్లు స్వీకరించడం దినచర్యగా ఉండేది.

ఇప్పుడు కరోనా సమయంలో స్టాలిన్ జిమ్‌లో నడక, సైక్లింగ్ మరియు వ్యాయామం చేస్తూ కనిపిస్తున్నాడు. ఎన్నికల ప్రచారంలో ఆయన అనేక గ్రామాలకు వెళ్లి ప్రజలను కలిశారు. అప్పుడు, సైక్లింగ్ చేస్తూ ఎక్కువగా గ్రామాల్లో తిరిగేవారు. ఈ పరిస్థితిలో, ముఖ్యమంత్రి అయిన తరువాత కరోనా నివారణ పనులలో బిజీగా ఉన్న చీఫ్ మినిస్టర్ స్టాలిన్.. పనుల ఒత్తిడి మధ్య కూడా వ్యాయామం చేయడం నిత్యకృత్యంగా చేసుకున్నాడు.

తన ఇంట్లో ఏర్పాటు చేసిన జిమ్‌లో స్టాలిన్ చేసే వ్యాయామాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. 68 సంవత్సరాల వయసులో కూడా జిమ్‌లో స్టాలిన్ వర్కౌట్స్ చేస్తున్నారు. ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షించగా.. సీఎం ఫిట్‌నెస్‌ను ప్రశంసిస్తున్నారు.