Liquor Delivery: పది నిమిషాల్లో మద్యం డెలివరీ.. ప్రారంభించిన హైదరాబాద్ సంస్థ

కోల్‌కతాలో పది నిమిషాల్లోనే మద్యాన్ని డోర్ డెలివరీ చేసేందుకు ఒక స్టార్టప్ ముందుకొచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ‘బూజీ’ ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కోల్‌కతా నగరంలో మద్యం డెలివరీ సేవలు ప్రారంభించింది.

Liquor Delivery: పది నిమిషాల్లో మద్యం డెలివరీ.. ప్రారంభించిన హైదరాబాద్ సంస్థ

Liquor Delivery

Updated On : June 5, 2022 / 6:16 PM IST

Liquor Delivery: దేశంలో ఇప్పటికే అనేక నగరాల్లో మద్యం డెలివరీకి అనుమతి ఉంది. ఢిల్లీ వంటి నగరాల్లో మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు. కోల్‌కతా నగరంలో కూడా ఈ సేవలు కొనసాగుతున్నాయి. అయితే, కోల్‌కతాలో పది నిమిషాల్లోనే మద్యాన్ని డోర్ డెలివరీ చేసేందుకు ఒక స్టార్టప్ ముందుకొచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ‘బూజీ’ ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కోల్‌కతా నగరంలో మద్యం డెలివరీ సేవలు ప్రారంభించింది. అది కూడా పది నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని చెబుతోంది కంపెనీ. ఇప్పటికే అక్కడ మద్యం డెలివరీ సేవలు కొనసాగుతున్నాయి.

Pawan Kalyan As CM: పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి.. బీజేపీకి జనసేన అల్టిమేటమ్

అయితే, పది నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని ప్రకటించిన మొదటి సంస్థ మాత్రం ‘బూజీ’నే. ఈ సేవలకు గాను ‘బూజీ’కి ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ఎక్సైజ్ శాఖ అనుమతి కూడా లభించింది. ‘బూజీ’ సంస్థ స్థానికంగా ఉన్న వైన్ షాపుల నుంచి మద్యాన్ని సేకరించి, వినియోగదారులకు అందిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీ ద్వారా వినియోగదారుల ప్రవర్తనను ఈ యాప్ అంచనా వేస్తుందని యాప్ నిర్వాహకులు తెలిపారు.