Tank Bund : సండే-ఫన్ డే బ్యాక్..ఏ కార్యక్రమాలుంటాయో తెలుసా ?

ప్రజలకు మరింత సందడి కల్పించేందుకు...పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫుడ్ స్టాల్స్, సంగీత కచేరీలు..ఇతర ప్రదర్శనలు నిర్వహిస్తుండడంతో ట్యాంక్ బండ్ ప్రజలతో కిక్కిరిసిపోతోంది.

Tank Bund : సండే-ఫన్ డే బ్యాక్..ఏ కార్యక్రమాలుంటాయో తెలుసా ?

Sunday Funday

Sunday-Funday : ట్యాంక్ బండ్ పై మంత్రి కేటీఆర్ సూచనతో ప్రారంభమైన ‘సండే ఫన్ డే’ కార్యక్రమం ఒక్క ఆదివారం వాయిదా పడడంతో ప్రజలు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఆ రోజు వినాయకుడి నిమజ్జనం, శోభాయాత్ర ఉండడంతో కార్యక్రమం నిర్వహించలేదు. ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సండే-ఫన్ డే కార్యక్రమం అత్యంత సందడి సందడిగా కొనసాగుతుందనే సంగతి తెలిసేందే.

Read More : Sunday Funday : ట్యాంక్ బండ్‌‌పై మరింత ఎంజాయ్ చేయొచ్చు, ఫుడ్ కోర్ట్..మ్యూజిక్

చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా..ట్యాంక్ బండ్ పై వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఎలాంటి వాహనాల రణగొణులు లేకుండా ఉండడం…వాహనాలపై నిషేధం విధించడంతో..ప్రజలు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. అంతేగాకుండా..ప్రజలకు మరింత సందడి కల్పించేందుకు…పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫుడ్ స్టాల్స్, సంగీత కచేరీలు..ఇతర ప్రదర్శనలు నిర్వహిస్తుండడంతో ట్యాంక్ బండ్ ప్రజలతో కిక్కిరిసిపోతోంది.

Read More : విజయవాడలో ఏం జరుగుతోంది ? మటన్ అంటే మండిపడుతున్నారు..చికెన్ అంటే..ఛీ ఛీ అంటున్నారు..

ఈ ఆదివారం సండే – ఫన్ డే ఉంటుందా ? లేదా అనే  డౌట్ తీర్చేశారు అర్బన్ డెవలప్ మెంట్ చీఫ్ సెక్రటరీ అరవింద కుమార్. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. 2021, సెప్టెంబర్ 26వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతోందని వెల్లడించారు. తినుబండారాలు అందుబాటులో ఉంటాయని, హ్యాండ్లూమ్ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. అంతేగాకుండా..తెలుగు పాటలు, ఆర్కేస్ట్రా, ఒగ్గు డోలు, గుస్సాడీ, బోనాలు, కోలాటం, టీఎస్ పోలీసు బ్యాండ్ వంటి ప్రదర్శనలు ఉంటాయన్నారు. గతంలో కూడా పలు కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులు కూర్చొడానికి ట్యాంక్ బండ్ చుట్టూ..పలు ఏర్పాట్లు చేసింది.