Supreme Court : నీట్ పీజీ కౌన్సిలింగ్ కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 రిజర్వేషన్లు ఈ సంవత్సరం కౌన్సిలింగ్ లో అమలు చేయాలని ఆదేశించింది. అయితే మార్చి మూడో వారంలో జరిగే విచారణకు, తుది తీర్పుకు లోబడి ఉండాలని తెలిపింది.

Supreme Court : నీట్ పీజీ కౌన్సిలింగ్ కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

Neet

Updated On : January 7, 2022 / 11:35 AM IST

NEET PG Counseling : నీట్ పీజీ కౌన్సిలింగ్ కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నీట్ పీజీ కౌన్సిలింగ్ లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటాపై సుప్రీంకోర్టులో రెండు రోజులు కీలక విచారణ జరిగింది. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ బొప్పన్న ధర్మాసనం ముందు విచారణ జరిగింది. నీట్ పీజీ కోర్సుల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది.

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు ఈ సంవత్సరం కౌన్సిలింగ్ లో అమలు చేయాలని ఆదేశించింది. అయితే మార్చి మూడవ వారంలో జరిగే విచారణకు, తుది తీర్పుకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. విచారణ అత్యవసరంగా జరపాలని మంగళవారం సుప్రీం కోర్టును కేంద్రం కోరింది.

Corona Cases : భారత్‌లో కరోనా సునామీ.. ఒక్కరోజే లక్షా 17 వేల 100 పాజిటివ్ కేసులు

కేంద్ర విజ్ఞప్తిని అంగీకరించి బుదవారం విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అంగకీరించారు. ఆ మేరకు బుధ, గురువారాల్లో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నీట్ పీజీ కౌన్సిలింగ్ ఆలస్యాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా రెసిడెంట్ డాక్టర్స్ ఉద్యమించారు.