సుశాంత్ అకాల మరణం.. మరో అభిమాని ఆత్మహత్య..

బాలీవుడ్ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణం చెందడాన్ని జీర్ణించుకోలేక మనస్తాపానికి అభిమాని ఆత్మహత్య..

  • Published By: sekhar ,Published On : June 19, 2020 / 07:47 AM IST
సుశాంత్ అకాల మరణం.. మరో అభిమాని ఆత్మహత్య..

Updated On : June 19, 2020 / 7:47 AM IST

బాలీవుడ్ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణం చెందడాన్ని జీర్ణించుకోలేక మనస్తాపానికి అభిమాని ఆత్మహత్య..

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అందరినీ కలచి వేసింది. హిందీ చిత్ర పరిశ్రమలో సుశాంత్ మరణం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అంతులేని ప్రతిభ ఉన్నా పరిశ్రమలో పెద్దలుగా చలామణీ అవుతన్న వారి చేత అణచివేతకు గురికావడంతోనే అతను ఆవేదనకు లోనై ఆత్మహత్య చేసుకున్నాడు, బాలీవుడ్‌లో బంధుప్రీతి చాలా ఎక్కువ, కొత్త వారిని తొక్కేస్తున్నారు అంటూ ఇండస్ట్రీ ప్రముఖులే బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. సుశాంత్ అకాల మరణాన్ని తట్టుకోలేక అతని వదిన కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా సుశాంత్ అభిమాని సూసైడ్ చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నంలోని శ్రీహరిపురానికి చెందిన సుమన కుమారి అనే యువతి ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది.

సుశాంత్ మరణించినప్పటినుంచి ఆమె పదే పదే అతనికి సంబంధించిన టిక్ టాక్ వీడియోలు చూస్తూ డిప్రెషన్‌లోకి వెళ్లింది. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులకు ఆమె ఫోన్ పరిశీలించాక గానీ అసలు విషయం తెలియలేదు. తన అభిమాన నటుడు అకాల మరణం చెందడాన్ని జీర్ణించుకోలేక మనస్తాపానికి గురై సదరు యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు నిర్ధారించారు.

రెండు రోజుల క్రితం సుశాంత్‌ను ఎంతగానో అభిమానించే అతని వీరాభిమాని అయిన పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి సుశాంత్ ఇక లేడన్న విషయం తెలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కఠిన నిర్ణయం తీసుకున్న ఆ బాలుడు సూసైడ్ నోట్ కూడా రాశాడు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ సూసైడ్ నోట్‌లో సుశాంత్‌ను ఉద్దేశించి ‘అతను ఆ పని చేయగా లేనిది నేనూ ఆ నిర్ణయం తీసుకోలేనా?’ అని రాసినట్లు  పోలీసులు గుర్తించారు.  
 

Read: బుల్‌బుల్‌ ట్రైలర్: ఆసక్తికరంగా.. అతీంద్రియ శక్తుల కథతో