Switzerland : స్విస్ బ్యాంకు నుంచి భారతీయుల జాబితా వచ్చేసింది!

స్విట్జర్లాండ్‌తో, భారత్ సమాచార మార్పిడి ఒప్పందం కుదుర్చుకున్న విషయం విదితమే. ఈ ఒప్పందం ప్రకారం స్విస్ బ్యాంకులోని భారతీయ ఖాతాదారుల జాబితాను భారత్ కు అందిస్తుంది స్విట్జర్లాండ్‌.

Switzerland : స్విస్ బ్యాంకు నుంచి భారతీయుల జాబితా వచ్చేసింది!

Switzerland

Switzerland : స్విట్జర్లాండ్‌తో, భారత్ సమాచార మార్పిడి ఒప్పందం కుదుర్చుకున్న విషయం విదితమే. ఈ ఒప్పందం ప్రకారం స్విస్ బ్యాంకులోని భారతీయ ఖాతాదారుల జాబితాను మన దేశానికి అందిస్తుంది స్విట్జర్లాండ్‌. ఇప్పటికే రెండు విడతల జాబితాను భారత్‌కి అందించింది స్విట్జర్లాండ్‌.. ఇక సోమవారం మూడవ విడత జాబితాను భారత్‌కు పంపింది.

Read More : Swiss Bank: ‘స్విస్ బ్యాంకులో ఇండియన్ల 20వేల కోట్లు ఉన్నాయనేది నిజం కాదు’

భారత్‌తో పాటు మరికొన్ని దేశాలకు చెందిన ఖాతా దారుల వివరాలను ఆయా దేశాలకు అందించింది స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం. సమాచారం అందుకున్న దేశాల్లో ఆంటిగ్వా, బార్బుడా, అజర్‌బైజాన్, డొమినికా, ఘనా, లెబనాన్, మకావు, పాకిస్తాన్, ఖతార్, సమోవా, వనాటుతో సమాచార మార్పిడి జరిగినట్లు స్విట్జర్లాండ్ ఫెడరల్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్ (FTA) సోమవారం తెలిపింది.

Read More : Swiss bank : స్విస్ బ్యాంక్‌లో పెరిగిన భారతీయుల సొమ్ము

భారత్ కి చెందిన మూడవ విడత జాబితాలో రియల్ ఎస్టేట్ ఆస్తుల మొత్తం కూడా ఉందని తెలిపారు. రియల్ ఎస్టేట్ లిస్టు ఇవ్వడం ఇదే తొలిసారి. కాగా భారత్ స్విస్ బ్యాంకు వివరాల గురించి ఎంతో కాలంగా ఎదురు చూస్తుంది. ఇక తాజాగా వచ్చిన లిస్టులో ఎవరెవరు ఉన్నారో తెలియాలంటే కొద్దీ రోజులు వేచి చూడక తప్పదు.