Tamannaah Bhatia : చిరు పక్కన ఛాన్స్ కొట్టేసిందిగా

మెగాస్టార్ చిరంజీవితో మరోసారి నటించబోతుంది మిల్కీబ్యూటీ తమన్నా..

Tamannaah Bhatia : చిరు పక్కన ఛాన్స్ కొట్టేసిందిగా

Tamannaah

Updated On : November 9, 2021 / 1:14 PM IST

Tamannaah Bhatia: మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లో.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర నిర్మాతగా.. తమిళ్‌లో ‘తల’ అజిత్ నటించగా సూపర్ డూపర్ హిట్ అయిన ‘వేదాళం’ సినిమా తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.

Bholaa Shankar : ‘మెగాస్టార్’ చెల్లెలిగా ‘మహానటి’..

అన్నాచెల్లెళ్ల రిలేషన్‌ని బేస్ చేసుకుని చక్కటి సెంటిమెంట్‌తో ఈ మూవీ తెరకెక్కబోతున్న ‘భోళా శంకర్’ లో ‘మహానటి’ ఫేం కీర్తి సురేష్, చిరు చెల్లెలిగా నటిస్తోంది. స్వరబ్రహ్మ మణిశర్మ తనయుడు.. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ సంగీతమందిస్తున్నాడు.

Bholaa Shankar : మెగాస్టార్‌తో మిల్కీబ్యూటీ

‘సైరా’ లో చిరుతో కలిసి తొలిసారి నటించింది తమన్నా.. ఆ క్యారెక్టర్ నిడివి తక్కవగా ఉంటుంది. పైగా హిస్టారికల్ ఫిలిం కాబట్టి తమన్నాతో కలిసి స్టెప్పులేసే ఛాన్స్ దొరకలేదని చిరు ఇంతకుముందు చెప్పారు. కట్ చేస్తే.. ఇప్పుడాయన తమన్నాతో డ్యాన్స్ చెయ్యాలనే ముచ్చట తీర్చుకోబోతున్నారు. మెగాస్టార్‌తో కలిసి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నానంటూ తన హ్యాపీనెస్‌ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది తమన్నా..

Naatu Naatu Song Promo : రామ్, భీమ్ ఆట – పాట.. తప్పదు రికార్డుల వేట..

సోమవారం ఈ సినిమాకి సంబంధించి చిరంజీవి లుక్‌టెస్ట్‌, ఫొటో షూట్ జరిగినట్లు డైరెక్టర్ మెహర్ రమేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మంగళవారం మెగాస్టార్ సరసన మిల్కీబ్యూటీ తమన్నా కథానాయికగా నటించనున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. నవంబర్ 11 ఉదయం 7:45 గంటలకు ‘భోళా శంకర్’ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.