Ravichandran Ashwin: మీ దుస్తులను ఇలాకూడా గుర్తుపట్టొచ్చు.. నవ్వులుపూయిస్తున్న క్రికెటర్ అశ్విన్ వీడియో ..

టీమ్ ఇండియా స్పిన్ బౌలర్ రవిచందర్ అశ్విన్ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైదానంలో రెండు జెర్సీలు ఉన్నాయి. వాటిలో తన జెర్సీ ఏదో గుర్తుపట్టేందుకు ప్రయత్నించాడు. తేడా తెలియకపోవటంతో ఆ రెండు జెర్సీల వాసన చూసి అందులో ఒకటి తనదేనని గుర్తించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది.

Ravichandran Ashwin: మీ దుస్తులను ఇలాకూడా గుర్తుపట్టొచ్చు.. నవ్వులుపూయిస్తున్న క్రికెటర్ అశ్విన్ వీడియో ..

Ravichandran Ashwin

Ravichandran Ashwin: టీమ్ ఇండియా స్పిన్ బౌలర్ అశ్విన్ చేసిన చిలిపి పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచ కప్ జరుగుతుంది. సూపర్-12 మ్యాచ్ లలో భాగంగా గత ఆదివారం టీమ్ ఇండియా జ్వింబాబే జట్టుతో తలపడింది. టాస్ అనంతరం కెప్టెన్ రోహిత్‌శర్మ గ్రౌండ్‌లో మాట్లాడుతున్నాడు. ఈ వీడియోలో అప్పటి వరకు గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేసిన అశ్విన్ నువ్వులు తెప్పించే పనిచేశాడు.

International Cricket: అంతర్జాతీయ క్రికెట్‌లో వాడే బంతి ఏది? దాని ధర ఎంతో తెలుసా? ఎన్ని రకాల బంతులను వాడుతారంటే?

ప్రాక్టిస్ అనంతరం మైదానం వీడేందుకు అశ్విన్ సిద్ధమయ్యాడు. ఈక్రమంలో అక్కడే రెండు జెర్సీలు ఉన్నాయి. వాటిని తీసుకొని పరిశీలించాడు. అందులో తనది ఏదో అర్థంకాలేదు. వెంటనే ఆ రెండు జెర్సీల వాసన చూసి ఒకదానిని తీసుకొని, మరొకదానిని అక్కడేపడేసి వెళ్లాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో .. మన దుస్తులను ఇలాకూడా గుర్తుపట్టొచ్చా అశ్విన్ భయ్యా అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియోపై టీమ్ ఇండియా మాజీ క్రికెట్ హర్బజన్ సింగ్ స్పందిస్తూ ఫన్నీ కామెంట్ చేశాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావటంతో అశ్విన్ స్పందించాడు. సైజులు వేరేగా ఉన్నాయేమోనని చెక్ చేశా.. వాడినవేమోనని చూశా.. సెట్ కాలేదు.. చివరికి నేను వాడిన పర్ఫూమ్‌ వాసనను బట్టి గుర్తు పట్టా. అరే.. కెమెరామెన్ అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.