WTC Final 2023: టీమిండియాకు అగ్నిపరీక్షే..! గత రికార్డులనుచూస్తే విజయం సులువే అంటున్న మాజీలు.. టెస్టు చరిత్రలో భారత్ ఛేదించిన అతిపెద్ద లక్ష్యం అదే..

గతంలో టీమిండియా పలుసార్లు భారీ లక్ష్యాలను ఛేదించింది. టెస్టు చరిత్రలోనే అతిపెద్ద టాప్-7 లక్ష్య ఛేదనల్లో భారత జట్టు పేరు రెండు సార్లు చేరింది.

WTC Final 2023: టీమిండియాకు అగ్నిపరీక్షే..! గత రికార్డులనుచూస్తే విజయం సులువే అంటున్న మాజీలు.. టెస్టు చరిత్రలో భారత్ ఛేదించిన అతిపెద్ద లక్ష్యం అదే..

WTC Final 2023

WTC Final 2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ (WTC Final 2023) మ్యాచ్‌లో చివరిరోజు టీమిండియా అసలైన అగ్నిపరీక్షను ఎదుర్కోనుంది. కళ్లముందే విజయం కనిపిస్తున్నా.. అది అంతసులువేం కాదు. అయితే, చివరి వరకు కీలక బ్యాటర్లు క్రీజులో ఉంటే విజయం సాధించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి టీమిండియా బ్యాటర్లు ఆ ప్రయత్నంలో ఏమేరకు విజయం సాధిస్తారనేది ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్ టెస్ట్ మ్యాచ్‌లో నాలుగు రోజుల ఆట పూర్తయింది. టీమిండియాకు ఆసీస్ 444 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

WTC Final- Gill: ఇది ఔటా? థర్డ్ అంపైర్ నిర్ణయంపై శుభ్‌మన్ గిల్ సెటైరికల్ ట్వీట్.. నిరాశలో టీమిండియా ఫ్యాన్స్

చివరి వరకు క్రీజులో నిలిస్తేనే .. 

నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా మూడు వికెట్ కోల్పోయి 164 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (44), అజింక్యా రహానే (20) క్రీజులో ఉన్నారు. టీమిండియా ఈ చారిత్రాత్మక టెస్టులో విజయం సాధించాలంటే మరో 280 పరుగులు చేయాల్సి ఉంది. కోహ్లీ, రహానేతో పాటు రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఆంధ్రా కుర్రాడు, వికెట్ కీపర్ భరత్ ఉన్నారు. వీరిలో ఏఒక్కరి భాగస్వామ్యం సుదీర్ఘంగా సాగినా భారత్ విజయం నల్లేరుపై నడకే అవుతుంది. అలాకాకపోయినా కనీసం మ్యాచ్ డ్రా అయినా అవుతుంది. అలా జరగాలంటే, కంగారు జట్లు బౌలర్ల నుంచి దూసుకొచ్చే బంతులను ఎదుర్కొని క్రీజులో నిలబడాల్సి ఉంటుంది.

WTC Final 2023: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌.. భార‌త విజ‌య ల‌క్ష్యం 444

అప్పుడు గెలించాం.. ఇప్పుడు గెలుస్తామా?

ఆస్ట్రేలియాలో 2020-21 బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భాగంగా టీమిండియా నాలుగు టెస్టులు ఆడింది. అందులో మొదటి టెస్టు ఓడిపోయి, రెండో టెస్టు టీమిండియా విజయం సాధించింది. మూడో టెస్టు డ్రాగా ముగిసింది. నిర్ణయాత్మక నాలుగో టెస్టు మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ బ్రిస్బేన్ లో జరిగింది. రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టు 328 పరుగులు చేయాల్సి ఉండగా, గిల్, పుజారా, పంత్ అద్భుతంగా రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఆ అద్భుత విజయం మరోసారి ఆస్ట్రేలియాపై పునరావృతం అవుతుందన్న ఆశతో టీమిండియా ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రతిష్టాత్మక టెస్టు మ్యాచ్‌లో 280 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ సేన విజయం సాధిస్తుందన్న ఆశతో క్రీడాభిమానులు ఎదురుచూస్తున్నారు.

WTC Final 2023: ఉత్కంత‌భ‌రితంగా మారిన డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌.. భార‌త‌ విజ‌యానికి 280 ప‌రుగులు.. ఆస్ట్రేలియా గెలుపుకు 7 వికెట్లు

గతంలో టీమిండియా పలుసార్లు భారీ లక్ష్యాలను ఛేదించింది. టెస్టు చరిత్రలోనే అతిపెద్ద టాప్-7 లక్ష్య ఛేదనల్లో భారత జట్టు పేరు రెండు సార్లు చేరింది. 1976లో 406 పరుగుల లక్ష్యాన్ని ఛేధించే క్రమంలో వెస్టిండీస్ పై టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2008 డిసెంబర్ 11న టెస్టు చరిత్రలో భారత్ జట్టు రెండవ అతిపెద్ద లక్ష్య ఛేదన రికార్డును నెలకొంది. చెన్నైలో ఈ మ్యాచ్ జరగగా.. ఇంగ్లండ్ జట్టు నిర్దేశించిన 387 పరుగులను పూర్తిచేసి ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.

WTC Final 2023: ఓటమి అంచుల్లో టీమిండియా.. విజయం సాధించాలంటే 121ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాల్సిందేనా..

టెస్టు చరిత్రలో అతిపెద్ద లక్ష్య ఛేదనలు ఇవే..

– 2003 మే9న వెస్టిడీస్ (418/7) భారీ లక్ష్యాన్ని ఛేదించి ఆస్ట్రేలియాపై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
– 2008 డిసెంబర్ 17న దక్షిణాఫ్రికా జట్టు (414/4) భారీ లక్ష్యాన్ని ఛేదించి ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
– 1976 ఏప్రిల్ 7న భారత్ జట్టు (406/4) భారీ లక్ష్యాన్ని ఛేదించి ఆరు వికెట్ల తేడాతో వెస్టిండీస్ పై విజయం సాధించింది.
– 1948 జూలై 22న ఆస్ట్రేలియా జట్టు (404/3) భారీ లక్ష్యాన్ని ఛేదించి ఇంగ్లండ్ జట్టుపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
– 2021 ఫిబ్రవరి 3న వెస్టిండీస్ జట్టు (395/7) లక్ష్యాన్ని ఛేదించి బంగ్లాదేశ్ జట్టుపై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
– 2017 జూలై 14న శ్రీలంక జట్టు (391/6) లక్ష్యాన్ని ఛేదించి జింబాబ్వేను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది.
– 2008 డిసెంబర్ 11న భారత్ జట్టు (387/4) లక్ష్యాన్ని ఛేదించి ఆరు వికెట్ల తేడాతో ఇంగ్లాడ్ పై విజయం సాధించింది.