WTC Final- Gill: ఇది ఔటా? థర్డ్ అంపైర్ నిర్ణయంపై శుభ్‌మన్ గిల్ సెటైరికల్ ట్వీట్.. నిరాశలో టీమిండియా ఫ్యాన్స్

థర్డ్ అంపైర్ వివాదాస్పద ఔట్ నిర్ణయంపై శుభ్‌మన్ గిల్ తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడాడు. మ్యాచ్ అనంతరం తన అధికారిక ట్విటర్ ఖాతాలో థర్డ్ అంపైర్ నిర్ణయంపై గిల్ సెటైరికల్ గా ట్వీట్ చేశాడు.

WTC Final- Gill: ఇది ఔటా? థర్డ్ అంపైర్ నిర్ణయంపై శుభ్‌మన్ గిల్ సెటైరికల్ ట్వీట్.. నిరాశలో టీమిండియా ఫ్యాన్స్

Shubman Gill

WTC Final 2023: లండన్‌లోని ఓవల్ స్టేడియం (Oval Stadium) లో ఆస్ట్రేలియా (Australia) , ఇండియా (India) జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ (World Test Championship Final) మ్యాచ్‌లో రోహిత్ సేన (Rohit Sena) ఓటమి అంచుల్లో ఉంది. చివరి రోజు ఆదివారం బ్యాటర్లు ఔట్ కాకుండా చివరి వరకు ఆడితే కనీసం డ్రా అయినా చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ, పరిస్థితి అలా కనిపించడం లేదు. కంగారు బౌలర్లు పదునైన బంతులకు టీమిండియా బ్యాటర్లు తడబడుతున్నారు. ఇదిలాఉంటే  నాలుగోరోజు (శనివారం) ఆటలో టీమిండియా కీలక ఆటగాడు, ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఔట్ వివాదాస్పదంగా మారింది. థర్డ్ అంపైర్ సైతం దీనిని ఔట్‌గా ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

WTC Final 2023: ఉత్కంత‌భ‌రితంగా మారిన డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌.. భార‌త‌ విజ‌యానికి 280 ప‌రుగులు.. ఆస్ట్రేలియా గెలుపుకు 7 వికెట్లు

444 పరుగుల రికార్డు లక్ష్యంతో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (Rohit Sharma) , శుభ్‌మన్ గిల్ (Shubman Gill) క్రీజులోకి వచ్చారు. ఇద్దరూ స్వేచ్ఛగా ఆడుతూ జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చేలా కనిపించారు. కానీ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో బోలాండ్ వేసిన తొలి బంతి గిల్ బ్యాట్ ను తాకి స్లిప్‌లో ఉన్న గ్రీన్ దగ్గరపడేలా కనిపించింది. గ్రీన్ తన ఎడమవైపు డైవ్ చేసి ఎడమ చేత్తో ఆ బాల్ అందుకున్నాడు. అయితే, ఆ బాల్ నేలకు తాకినట్లు కనిపించింది. అపైర్లు తుది నిర్ణయాన్ని థర్డ్ అపైర్‌కు వదిలేశారు. పలు దఫాలుగా టీవీ రిప్లైలో పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చారు. గ్రీన్ క్యాచ్ పట్టే సమయంలో బాల్ నేలను తాకినట్లు స్పష్టంగా కనిపించింది. అయినా థర్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడం పట్ల భారత్ అభిమానులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

WTC Final 2023: ఓటమి అంచుల్లో టీమిండియా.. విజయం సాధించాలంటే 121ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాల్సిందేనా..

థర్డ్ అంపైర్ వివాదాస్పద ఔట్ నిర్ణయంపై శుభ్‌మన్ గిల్ తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడాడు. మ్యాచ్ అనంతరం తన అధికారిక ట్విటర్ ఖాతాలో థర్డ్ అంపైర్ నిర్ణయంపై గిల్ సెటైరికల్ గా ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌లో గ్రీన్ క్యాచ్ పట్టే ఫొటోను షేర్ చేస్తూ.. సెర్చ్ సింబల్స్‌తో కూడిన రెండు ఎమోజీలు, కన్నుమూసుకొని ఉన్న ఓ ఎమోజీని గిల్ పోస్టు చేశాడు. థర్డ్ అంపైర్ కు కళ్లు సరిగ్గా కనిపించటం లేదా? అనే అర్థం వచ్చేలా శుభ్‌మన్ గిల్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ గా మారింది.

WTC Final 2023: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌.. భార‌త విజ‌య ల‌క్ష్యం 444

శుభ్‌మన్ గిల్ ట్వీట్ కు మద్దతుగా టీమిండియా ఫ్యాన్స్ రీ ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు కీలక మ్యాచ్ లో థర్డ్ అంపైర్ నిర్ణయంపై పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. రిప్లేలో స్పష్టత లేదు. నిర్ణయం తీసుకునే ముందు అంపైర్ మరింత జూమ్ చేసి చూడాల్సింది.. ఈ నిర్ణయం భారత్‌ను దెబ్బకొట్టేదే అని హర్బజన్ సింగ్ వ్యాఖ్యానించారు. మరోవైపు గిల్ ఔట్ కావటంతో టీమిండియా ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. ఇటీవల కాలంలో గిల్ అద్భుత ఫామ్ లో ఉన్నారు. తాజాగా టెస్టు తొలి ఇన్నింగ్స్ లో తక్కువ పరుగులకే ఔట్ అయిన గిల్.. రెండో ఇన్నింగ్స్ లో సుదీర్ఘ బ్యాటింగ్ కొనసాగిస్తాడని అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ గిల్ వివాదస్పద ఔట్ రూపంలో వెనుదిరగడంతో క్రికెట్ ఫ్యాన్స్ పలు రూపాల్లో తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు.