TECNO Spark Go Launch : రూ. 7వేల లోపు ధరకే టెక్నో స్పార్క్ గో సిరీస్ బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ఇప్పుడే కొనేసుకోండి..!

TECNO Spark Go Launch : చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు టెక్నో మొబైల్ (Tecno Mobile) 'స్పార్క్ గో' సిరీస్‌లో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. భారత మార్కెట్లోకి TECNO Spark Go సిరీస్ పేరుతో రిలీజ్ చేసింది. ఈ ఫోన్‌లో టైప్-C ఛార్జర్‌తో 5000 mAh బ్యాటరీ ఉంటుంది.

TECNO Spark Go Launch : రూ. 7వేల లోపు ధరకే టెక్నో స్పార్క్ గో సిరీస్ బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ఇప్పుడే కొనేసుకోండి..!

TECNO Spark Go 2023 with 5000 mAH battery launched under Rs 7000 in India

TECNO Spark Go Launch : చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు టెక్నో మొబైల్ (Tecno Mobile) ‘స్పార్క్ గో’ సిరీస్‌లో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. భారత మార్కెట్లోకి TECNO Spark Go సిరీస్ పేరుతో రిలీజ్ చేసింది. ఈ ఫోన్‌లో టైప్-C ఛార్జర్‌తో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. రూ. 7వేల లోపు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లలో టెక్నో స్పార్స్ గో సిరీస్ ఫోన్ అందుబాటులో ఉంది. అదనంగా, ఈ ఫోన్ 13-MP ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ రింగ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. టెక్నో స్పార్క్ గో సిరీస్‌కు కొత్త ఎడిషన్‌ను బడ్జెట్ ఫోన్‌గా భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.

ఇందులో కెమెరా, లాంగ్ బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కీలక ఫీచర్లుగా ఉన్నాయి. అదనపు సెక్యూరిటీ కోసం వెనుకవైపు ఫింగర్ ఫ్రింట్ సెన్సార్‌తో మెరుగైన వ్యూ క్వాలిటీ కోసం 6.56 అంగుళాల HD IPS డిస్‌ప్లేను కంపెనీ అందిస్తోంది. ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో Tecno Spark Go 2023ని చివరి ఆప్షన్‌గా టెక్నో పేర్కొంది. TECNO Spark Go 2023 ధర భారత మార్కెట్లో ఎంత ఉంటుంది? ఏయే ఫీచర్లు ఉన్నాయో ఓసారి లుక్కేయండి.

TECNO ధర ఎంతంటే? :
టెక్నో అత్యంత సరసమైన స్మార్ట్‌ఫోన్‌లలో TECNO Spark Go 2023 ఒకటిగాఉంది. 256GB వరకు ఏకైక 3GB RAM, 32GB స్టోరేజ్ మోడల్‌ ధర రూ.6999గా ఉంది. ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో నెబ్యులా పర్పుల్, ఎండ్‌లెస్ బ్లాక్ ఉయుని బ్లూలో వస్తుంది. TECNO Spark Go 2023 ఫోన్ జనవరి 23, 2023 నుంచి రిటైల్ స్టోర్‌లలో సేల్ అందుబాటులోకి వచ్చింది.

Read Also : Tecno Pova 4 : భారత్‌లో టెక్నో Pova 4 స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర చాలా తక్కువ.. ఇప్పుడే కొనేసుకోండి..!

టెక్నో స్పార్క్ గో 2023 స్పెసిఫికేషన్స్ ఇవే :
టెక్నో ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అగ్ర పోటీదారులలో ఒకటిగా ఉంది. TECNO Spark Go 2023లో అనేక ఫీచర్లతో వచ్చింది. 20:9 స్క్రీన్ యాస్పెక్ట్ రేషియోతో 6.56-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్ప్లే 480 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ని అందిస్తుంది. IPX2 రేటింగ్‌తో వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది. హుడ్ కింద, TECNO Spark Go 2023 Helio A22 2.0 GHz CPU ద్వారా పనిచేస్తుంది. Android 12 ఆధారంగా HiOS 12.0పై రన్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ 3GB RAM, 32 GB స్టోరేజ్ వేరియంట్‌ను అందించే ఏకైక వేరియంట్‌గా ఉండనుంది. 256 GB వరకు ఈ స్టోరేజీని విస్తరించవచ్చు.

TECNO Spark Go 2023 with 5000 mAH battery launched under Rs 7000 in India

TECNO Spark Go 2023 with 5000 mAH battery launched under Rs 7000 in India

ఫొటోల కోసం.. Tecno డ్యూయల్ రింగ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 13-MP ప్రైమరీ కెమెరా డ్యూయల్ ఫ్లాష్‌లైట్‌లు ఉన్నాయి. సెల్ఫీల కోసం.. ఫోన్ డ్యూయల్ మైక్రో స్లిట్ ఫ్లాష్‌లైట్‌తో 5-MP కెమెరాను అందిస్తుంది. Tecno Spark Go 2023లో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, సామీప్యత, ఇ-కంపాస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఇంటర్నల్ సెన్సార్‌లు కూడా ఉన్నాయి.

పవర్ కోసం స్పార్క్ గో 2023 32 రోజుల స్టాండ్‌బైతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఛార్జ్ చేసేందుకు ఫోన్ C 10W టైప్ ఛార్జర్‌కు సపోర్టు ఇస్తుంది. కనెక్టివిటీ విషయానికొస్తే.. TECNO Spark Go 2023 4G ఫోన్ 5.0 బ్లూటూత్ కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. అద్భుతమైన ఫీచర్లతో వచ్చిన ఈ టెక్నో స్పార్క్ గో సిరీస్ ఫోన్ వెంటనే కొనుగోలు చేసుకోండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Tecno Phantom X2 5G : టెక్నో మొబైల్ నుంచి అత్యంత ఖరీదైన 5G ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?