Telangana : హైదరాబాద్ టు ముంబై, సీఎం కేసీఆర్ వెంట వెళ్లిన వారు వీరే

ఆదివారం మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు సీఎం కేసీఆర్. అక్కడి ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు.

Telangana : హైదరాబాద్ టు ముంబై, సీఎం కేసీఆర్ వెంట వెళ్లిన వారు వీరే

Kcr

KCR Mumbai Tour : జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్ర ప్రభుత్వంతో విబేధిస్తున్న అన్ని పార్టీలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు ఆయన నడుం బిగించారు. అందులో తొలి అడుగు పడింది. 2022, ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారం మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు సీఎం కేసీఆర్. అక్కడి ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు.

 

Cm Kcr National Party

Cm Kcr National Party

Read More : KCR – Uddhav: నేడు మహారాష్ట్ర సీఎంతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ

దేశ రాజకీయాలపై సుదీర్ఘంగా వారు చర్చించనున్నారు. పీపుల్స్ ఫ్రంట్ పై ప్రధాన ఏజెండాగా ఉండనున్నట్లు సమాచారం. ఆదివారం బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న అనంతరం విమానంలో ముంబైకి వెళ్లారు. సీఎం కేసీఆర్ వెంట మహారాష్ట్రకు వెళ్లిన వారిలో ఎంపీలు కేకే, రంజిత్ రెడ్డి, సంతోష్ కుమార్, బీబీ పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి , ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి, ఇతరులున్నారు.

 

Uddhav Thackeray

Uddhav Thackeray

Read More : ఫ్రంట్‌ ముచ్చట్లు, మహారాష్ట్రకు సీఎం కేసీఆర్

ప్రస్తుతం జరుగుతున్న ఉత్తర్‌ ప్రదేశ్ ఎన్నిక‌లు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సెమీ ఫైన‌ల్స్‌గా రాజ‌కీయ పార్టీలు భావిస్తున్నాయి. యూపీ ఫ‌లితాల‌కు అనుగుణంగా రాబోయే రోజుల్లో జాతీయ రాజ‌కీయాల్లో వేగంగా ప‌రిణామాలు మారే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. యూపీలో బీజేపీ బ‌లం నిరూపించుకోకపోతే జాతీయ స్థాయిలో ప్రాంతీయ‌ పార్టీల హ‌వా పెరుగుతుంద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. దేశ రాజకీయాల్లోని పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్న సీఎం కేసీఆర్.. బలమైన ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగడితేనే బీజేపీకి గట్టి షాక్ ఇవ్వొచ్చని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.