Telangana : కాంగ్రెస్ సీనియర్ల సమావేశానికి స్పందన కరువు, వీహెచ్, జగ్గారెడ్డిలు హాజరు

సమావేశానికి కేవలం వీహెచ్, జగ్గారెడ్డిలు మాత్రమే హాజరయ్యారు. సమావేశానికి వెళ్లవద్దని సీనియర్లకు ఏఐసీసీ ఇంచార్జ్ కార్యదర్శిబోసురాజు ఫోన్ చేయడంతో...

Telangana : కాంగ్రెస్ సీనియర్ల సమావేశానికి స్పందన కరువు, వీహెచ్, జగ్గారెడ్డిలు హాజరు

Congress Vh

Updated On : March 20, 2022 / 12:41 PM IST

Telangana Congress Seniors Meeting : సమావేశం నిర్వహించాలని అనుకున్న కాంగ్రెస్ సీనియర్ల వ్యూహం బెడిసి కొట్టింది. సమావేశానికి కేవలం వీహెచ్, జగ్గారెడ్డిలు మాత్రమే హాజరయ్యారు. సమావేశానికి వెళ్లవద్దని సీనియర్లకు ఏఐసీసీ ఇంచార్జ్ కార్యదర్శిబోసురాజు ఫోన్ చేయడంతో వారు వెనక్కి తగ్గారు. సీనియర్ల మీటింగ్ పై ఆయన రెస్పాండ్ అయ్యారు. సీనియర్ల సమావేశం పెట్టుకోవద్దని సూచన మాత్రమే చేసినట్లు, మీటింగ్ నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పలేదని స్పష్టం చేశారు. ఇలాంటి సమావేశాలు నిర్వహించడం పార్టీకి మంచిది కాదని మాత్రమే తాను సూచించడం జరిగిందని, నేతల మధ్య సమన్వయం లేకపోవడం కారణంగా చిన్న చిన్న విబేధాలు వస్తున్నాయన్నారు.

Read More : Telangana : నేతల భేటీపై అధిష్టానం సీరియస్.. సీనియర్లకు ఫోన్

తమ స్థాయిలో పరిష్కరించగలిగే అంశాలను తాము పరిష్కరించడం జరుగుతుందని, తమతో కానివి… రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి చూడడం జరుగుతుందన్నారు. ఆపై కేసీ వేణుగోపాల్, ఆపైన హైకమాండ్ సోనియా వద్దకు సమస్యలు వెళతాయన్నారు. తాను రెండు, మూడు రోజుల్లో తెలంగాణకు వచ్చి పర్యటిస్తామని, నేతలతో సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. 2022, మార్చి 20వ తేదీ ఆదివారం హోటల్ అశోకలో సమావేశం ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈయనే స్వయంగా పలువురు సీనియర్లకు ఫోన్ చేసి సమావేశానిక రావాల్సిందిగా కోరారు.

Read More :Telangana Congress : టి.కాంగ్రెస్ సీనియర్ల భేటీ…22న ఢిల్లీకి

ఈ విషయం తెలుసుకున్న అధిష్టానం సీరియస్ అయ్యింది. ఏఐసీసీ ఇంచార్జీ కార్యదర్శి బోసురాజు జోక్యం చేసుకుని పలువరు సీనియర్లకు ఫోన్ చేశారు. అంతకుముందే హోటల్ అశోకకు వీహెచ్ చేరుకున్నారు. తర్వాత జగ్గారెడ్డి కూడా వచ్చారు. మిగతా వారు మాత్రం రాకపోవడంతో సమావేశానికి స్పందన కరువు అయ్యింది. ఈ విషయంపై వీహెచ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ను బతికించుకోవడం కోసమే మీటింగ్ పెట్టినట్లు, బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. డైరెక్ట్ గా మాణిక్యం ఠాగూర్ మాట్లాడితేనే సమావేశం రద్దు చేస్తానని ఖరాఖండిగా చెప్పారు. లేనిపక్షంలో సోనియా, రాహుల్ అపాయింట్ మెంట్ ఇప్పించాలని సూచించారు.