Ibrahimpatnam Family Planning Operation : ఇబ్బహీంపట్నం కు.ని. ఆపరేషన్ల ఘటన .. DMHO స్వరాజ్యలక్ష్మి బదిలీ .. డాక్టర్‌పై క్రిమినల్ కేసు నమోదు
ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మృతి చెందారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం బాధ్యiలపై చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా రంగారెడ్డి DMHO స్వరాజ్యలక్ష్మిపై బదిలీవేటు వేసింది. మొత్తం 13మందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.

Ibrahimpatnam Family Planning Operation
Ibrahimpatnam Family Planning Operation : ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మృతి చెందారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం బాధ్యiలపై చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా రంగారెడ్డి DMHO స్వరాజ్యలక్ష్మిపై బదిలీవేటు వేసింది. మొత్తం 13మందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. అపరేషన్లు చేసిన డాక్టర్ జోయల్ సునీల్ పై క్రిమినల్ కేసు నమోదు చేసింది.
కమిటీ నివేదిక ఆధారంగా.. రంగారెడ్డి DMHO స్వరాజ్యలక్ష్మి, DCHS ఝాన్సీ లక్ష్మిపై బదిలీ వేటు వేసింది. వీరితో పాటు మొత్తం 13 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆపరేషన్లు చేసిన డాక్టర్ జోయల్ సునీల్ కుమార్‌పై క్రిమినల్ కేసు పెట్టగా.. బాధ్యులపై చర్యలతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మార్గదర్శకాలు జారీ చేసింది.
ఆగస్టు 25న ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వ ఆస్పత్రిలో 34 మంది మహిళలకు కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేయగా.. ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ కోసం ఓ కమిటీని నియమించింది. విచారణ చేపట్టిన కమిటీ నివేదికను రూపొందించి ప్రభుత్వనికి సమర్పించగా కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం.