Telangana Corona Cases : తెలంగాణలో కొత్తగా 401 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 401 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Telangana Corona Cases : తెలంగాణలో కొత్తగా 401 కరోనా కేసులు

Telangana Corona Cases

Telangana Corona Cases : తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 39వేల 288 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 401 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,86,422కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4వేల 109కి పెరిగింది.

కరోనా నుంచి నిన్న 865 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5వేల 646 కోవిడ్ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ 124 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. క్రితం రోజుతో(425) పోలిస్తే కొత్త కేసులు తగ్గాయి.

Telangana : కరోనా వ్యాక్సినేషన్..దేశంలోనే తెలంగాణ టాప్

దేశంలో రోజురోజుకూ కరోనా కొత్త కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ముందురోజు 25 వేలకు దిగొచ్చిన కొత్త కేసులు.. తాజాగా 22,270కి పడిపోయాయి. శుక్రవారం 12 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. పాజిటివిటీ రేటు రెండు శాతం(1.8 శాతం) దిగువకు చేరి ఊరటనిస్తోంది. శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ ఈ గణాంకాలు తెలిపింది.

కొవిడ్ వ్యాప్తి కట్టడిలో ఉండటంతో యాక్టివ్ కేసులు 2.5 లక్షలకు తగ్గాయి. ఆ కేసుల రేటు 0.59 శాతానికి క్షీణించింది. నిన్న ఒక్కరోజే 60 వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ 4.28 కోట్ల మందికి కరోనా సోకగా.. 4.20 కోట్ల మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.12 శాతానికి చేరింది. 24 గంటల వ్యవధిలో 325 మంది ప్రాణాలు కోల్పోయారు. ముందురోజు కంటే మరణాల సంఖ్య(492)లో తగ్గుదల కనిపించింది. మొత్తంగా 5,11,230 మంది కోవిడ్ తో చనిపోయారు.

గతేడాది జనవరి నుంచి దేశంలో కరోనా టీకా కార్యక్రమం నిర్విరామంగా సాగుతోంది. అప్పటినుంచి 175 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. అలాగే దేశంలో 80 శాతం మంది వయోజనులు రెండు డోసుల టీకా తీసుకున్నారని, 100 శాతం వ్యాక్సినేషన్ దిశగా దేశం పయనిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం 36 లక్షల మందికి పైగా టీకా వేయించుకున్నారు.

Corona Virus: కరోనా ముగిసింది.. ఐటీ ఉద్యోగులకూ “వర్క్ ఫ్రమ్ హోమ్” అవసరం లేదు

దేశంలో కరోనా కేసుల కొండ కరుగుతోంది. ఫస్ట్, సెకండ్ వేవ్‌తో పోల్చినప్పుడు థర్డ్ వేవ్ లో కేసులు ఎంత వేగంగా పెరిగాయో.. ఇప్పుడు అదే స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. కేవలం మూడు వారాల్లోనే 3 లక్షల స్థాయి నుంచి 30 వేల స్థాయికి కేసులు పడిపోయాయి. దీంతో రాష్ట్రాలు సైతం ఆంక్షలు సడలిస్తున్నాయి. ఫలితంగా దేశ వ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.