Telangana Weather : తెలంగాణలో పొడి వాతావరణం

ఆదివారం, సోమవారం రోజుల్లో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే..డిసెంబర్ 28వ తేదీ మంగళవారం ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో...

Telangana Weather : తెలంగాణలో పొడి వాతావరణం

Tg Weather

Telangana Weather Update : తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం మారిపోతోంది. మొన్నటి వరకు చలి గజగజా వణికిస్తే..ఇప్పుడు పొడి వాతావరణం ఏర్పడింది. మధ్యాహ్నం వేళ కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగినా..రాత్రి అయ్యే వరకు చలి పెరిగిపోతోంది. తాజాగా…రాగల మూడు రోజుల వరకు పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ/నైరుతి దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని, ఆదివారం, సోమవారం రోజుల్లో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే..2021, డిసెంబర్ 28వ తేదీ మంగళవారం ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. రాగల మూడు రోజుల వరకు ఎలాంటి హెచ్చరికలు లేవన్నారు.

Read More : Baba Vanga 2022: బాబా వంగా జోస్యం.. 2022లో జరగబోయేది ఇదే

గత కొద్ది రోజులుగా తెలంగాణను చలి వణికించింది. ఉదయం, రాత్రి వేళ్లల్లో ప్రజలు గజగజా వణికిపోయారు. ఇంటి నుంచి బయటకు రావడానికి జంకారు. అయితే..ఇప్పటికే కరోనా..కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ లు ప్రజలను భయపెడుతున్న క్రమంలో చలికాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శీతాకాలంలో ఫ్లూ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని, ప్రతొక్కరూ…జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా చిన్న పిల్లలు, వృద్ధులు చలి నుంచి కాపాడుకొనేందుకు జాగ్రత్తలు పాటించాలన్నారు. లేనిపక్షంలో వారిలో త్వరగా శ్వాసకోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు.