Tenth Paper Leak : టెన్త్ పేపర్ లీక్ కేసులో బిగ్ ట్విస్ట్

Tenth Paper Leak : లీక్ అయిన పేపర్ వివిధ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అయినట్లు గుర్తించడంతో వాటి అడ్మిన్లకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Tenth Paper Leak : టెన్త్ పేపర్ లీక్ కేసులో బిగ్ ట్విస్ట్

Tenth Paper Leak (Photo : Google)

Tenth Paper Leak : టెన్త్ క్వశ్చన్ పేపర్ల లీకేజీ కేసులో మరో బీజేపీ నేత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో బీజేపీ నేతకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు వరంగల్ పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేశారు. రేపు(ఏప్రిల్ 7) ఉదయం 11 గంటలకు విచారణకు రావాలన్నారు. వరంగల్ డీసీపీ కార్యాలయంలో రేపు ఈటలను విచారించనున్నారు. ఈటలతో పాటు ఆయన పీఏ రాజు, నరేందర్ కు కూడా నోటీసులిచ్చారు.

అంతేకాకుండా లీక్ అయిన పేపర్ వివిధ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అయినట్లు గుర్తించడంతో వాటి అడ్మిన్లకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఈటలకు సైతం పోలీసులు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఏం జరగనుంది? అనే ఉత్కంఠ నెలకొంది.

Also Read : 10th Paper Leak case : కేసీఆర్ మెడలు వంచే టైమ్ దగ్గరపడింది .. కుట్రలో భాగంగానే నాపై పేపర్ లీక్ కేసు – బండి సంజయ్

పోలీసుల నోటీసులపై ఈటల స్పందించారు. తనకు నోటీసులు అందాయన్నారు. తన లాయర్లతో డిస్కస్ చేస్తున్నట్లు వివరించారు. ప్రజాస్వామ్యం మీద గౌరవంతో కచ్చితంగా రేపు విచారణకు హాజరవుతానని ఈటల తెలిపారు. తనతో పాటే తన ఫోన్ కూడా తీసుకెళ్తానన్నారు. కాగా, కమలాపూర్ లో పదో తరగతి క్వశ్చన్ పేపర్ లీకేజ్ పై ఈటల స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డ్ చేయనున్నారు. పేపర్ లీక్ కేసులో ఏ-2గా ఉన్న ప్రశాంత్.. ఈటలకు కూడా క్వశ్చన్ పేపర్ కాపీని పంపినట్లు పోలీసులు చెబుతున్నారు. పేపర్‌ లీక్‌కు హుజూరాబాద్‌ నియోజకవర్గాన్నే ఎందుకు ఎంచుకున్నారు? అసలేం జరిగింది? దీని వెనుక ఇంకా ఎవరెవరున్నారు? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ వివరాలన్నీ తెలియాలంటే బీజేపీ నేతలను పూర్తి స్థాయిలో విచారించాలని భావిస్తున్నారు.

టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారింది. రాజకీయ రంగు పులుముకుంది. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారింది. టెన్త్ క్వశ్చన్ పేపర్ల లీక్ వెనుక బీజేపీ, బండి సంజయ్ కుట్ర ఉందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాన్ని అస్తిరపరిచేందుకు బీజేపీ కుట్ర చేసిందన్నారు. బండి సంజయ్ తన స్వార్ధ రాజకీయాల కోసం, అడ్డదారిలో అధికారం పొందేందుకు విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం దారుణం అన్నారు.

Also Read..Peddi Sudarshan Reddy: సెల్ ఫోన్ ఇవ్వమంటే బండి సంజయ్‌కు ఎందుకు భయం?

మేము పునాదులు వేస్తే, మీరు సమాధులు తవ్వుతున్నారు:
కాగా, టెన్త్ పేపర్ లీక్ వ్యవహారంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పేపర్ లీకేజీ నిందితులను జైల్లో పెట్టడం వల్లే ఇవాళ్టి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగిందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. చదువులు చెప్పేది బీఆర్ఎస్, లీకులు చేసేది బీజేపీ అని విమర్శించారు. బలమైన తెలంగాణ కోసం కేసీఆర్ పునాదులు వేస్తే.. బీజేపీ నేతలు సమాధులు తవ్వుతున్నారని నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ది నిజమైన దేశభక్తి అయితే, బీజేపీది కపట భక్తి అని ధ్వజమెత్తారు.