Peddi Sudarshan Reddy: సెల్ ఫోన్ ఇవ్వమంటే బండి సంజయ్‌కు ఎందుకు భయం?

బండి సంజయ్ విచారణ క్రమంలో సెల్‌ఫోన్ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వటం లేదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు.

Peddi Sudarshan Reddy: సెల్ ఫోన్ ఇవ్వమంటే బండి సంజయ్‌కు ఎందుకు భయం?

Narsampet MLA Peddi Sudarshan Reddy

Peddi Sudarshan Reddy: పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీలో ఎంపీ బండి సంజయ్ ప్రధాన కుట్రదారు అని పోలీసులు అభియోగం మోపారు. అరెస్టు చేసి, హనుమకొండ జిల్లా ప్రధాన మున్సిఫ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. దీంతో 14 రోజులు రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. పేపర్ లీకేజీ విషయంలో బండి సంజయ్, బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్ నేతలు విమర్శల దాడిని పెంచారు. తాజాగా సంజయ్ అరెస్టుపై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

10th Paper Leak : 10th పేపర్ లీకేజ్ కేసులో ఈటెల రాజేందర్‌కు నోటీసులు ..

బండి సంజయ్ విచారణ క్రమంలో సెల్‌ఫోన్ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత లాగా సెల్‌ఫోన్ విచారణ అధికారికి అప్పగించే దమ్ము బండి సంజయ్‌కి లేదా? అంటూ పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. ఈడీ విచారణలో ఎమ్మెల్సీ కవిత సెల్ ఫోన్లపై గగ్గోలు పెట్టిన బీజేపీ ఇప్పుడేం చెబుతుందని ప్రశ్నించారు. సంజయ్ జైలుకెళ్లగానే పీసీసీ చీఫ్ రేవంత్ ఎక్కడికెళ్లాడో తెలియడం లేదని, రేవంత్ సంజయ్ ఇద్దరు సిట్ దోస్తులే అంటూ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. బీజేపీ నేత సంజయ్, కాంగ్రెస్ నేత రేవంత్ ఇద్దరూ తోడు దొంగలేనని విమర్శించారు.]

BJPLeaks : బండి సంజయ్ అరెస్ట్.. ట్రెండింగ్‌లో #BJPLeaks

బండి సంజయ్ అరెస్టు తర్వాత కాంగ్రెస్ నోరు ఎందుకు పేకలడం లేదో చెప్పాలంటూ సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ విషయంలో రేవంత్, సంజయ్ ది ఒకటే బాట అన్నారు. హిందీ పేపర్ నిందితులతో చాట్ చేసిన సెల్ ఫోన్‌ను సంజయ్ తప్పించాడని, నాలుగు కోట్ల మంది ప్రజల ముందు దొంగ ఎవరో తేలిపోయిందన్నారు. బీజేపీ నేత సంజయ్ అడ్డంగా దొరికిన సానుభూతికోసం పాకులాడుతున్నాడంటూ విమర్శించారు. పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణం తప్పిన బండి సంజయ్‌ని స్పీకర్ భర్తరఫ్ చేయాలని కోరారు. నిత్యం నీతినిజాయితీల గురించి మాట్లాడే బీజేపీ, బండి సంజయ్‌ని ఎందుకు సస్పెండ్ చేయడం లేదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిప్రశ్నించారు.

Bandi Sanjay Arrest : టెన్త్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనలో బండి సంజయ్ అరెస్టు.. నిరసనగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధ చేసిన బీజేపీ శ్రేణులు

తెలంగాణ పేపర్ లీకేజీల వ్యవహారంలో డైరెక్షన్ ఢిల్లీది, యాక్షన్ రాష్ట్ర బీజేపీది అంటూ ఆరోపించారు. బండి సంజయ్‌కు అత్యంత సన్నిహితుడే పేపర్ లీకేజీకి పాల్పడటం ఆ ఫోటోను వారికే పంపడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. ఎప్పటికి మీడియాలో పోజులు కొట్టే రేవంత్ రెడ్డి ఇంత జరుగుతున్నా కనీసం పత్తా లేడని, దీనిని బట్టి తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అని అర్థమవుతుందని సుదర్శన్ రెడ్డి అన్నారు.