India vs New Zealand: భారత్ బౌలర్ల విజృంభణ.. అతితక్కు‌వ స్కోర్‌కే కుప్పకూలిన కివీస్ టాప్ ఆర్డర్

న్యూజిలాండ్ తో రెండో వన్డేలో భారత్ బౌలర్లు చలరేగిపోయారు. తక్కువ స్కోర్ కే కివీస్ టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చారు. కేవలం 15 పరుగులకే న్యూజిలాండ్ ఐదు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

India vs New Zealand: భారత్ బౌలర్ల విజృంభణ.. అతితక్కు‌వ స్కోర్‌కే కుప్పకూలిన కివీస్ టాప్ ఆర్డర్

India vs New Zealand

India vs New Zealand:  రెండో వన్డేలో భారత్ బౌలర్లు చెలరేగిపోయారు. తక్కువ స్కోర్‌కే కివీస్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. కేవలం 15 పరుగులకే న్యూజిలాండ్ ఐదు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం రాయ్‌పుర్‌లో రెండో వన్డే జరుగుతుంది. టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ తీసుకున్నాడు.

Yuzvendra Chahal: రిపోర్టర్‌గా మారిన క్రికెటర్ చాహల్ .. ఇషాన్‌తో ఫన్నీ ఇంటర్వ్యూ.. వీడియో వైరల్

న్యూజిలాండ్ ఓపెనర్లుగా ఫిన్ అలెన్, డేవన్ కాన్వే క్రిజ్‌లోకి వచ్చారు. మొదటి ఓవర్ నుంచి భారత్ బౌలర్లు పదునైనా బంతులతో కివీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. తొలి ఓవర్ మహమ్మద్ షెమీ వేయగా.. పరుగులేమీ చేయకుండా ఫిన్ అలెన్ పెవిలియన్ బాటపట్టారు. మొదటి ఓవర్లో మహ్మద్ షమీ వేసిన ఐదో బంతికి ఫిన్ అలెన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత క్రిజ్‌లోకి వచ్చిన నికోల్స్ వచ్చాడు. డేవన్ కాన్వే, నికోల్స్ భాగస్వామ్యం కూడా ఎక్కువసేపు నిల్వలేదు. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో హెన్రీ నికోల్స్  (2) పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. ఆ తరువాత క్రిజ్‌లోకి వచ్చిన డారి మిచెల్ (1) పరుగుకే షమీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.

India vs New Zealand: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

ఏడు ఓవర్లకు కివీస్ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది. హార్ధిక్ పాండ్యా వేసిన అద్భుతమైన బంతికి కివీస్ కీలక బ్యాటర్ డేవన్ కాన్వే (7)సైతం పెవిలియన్ బాట పట్టాడు. 10వ ఓవర్ శార్దూల్ ఠాకూర్ వేయగా.. కెప్టెన్ టామ్ లేథమ్ (1) స్లిప్‌లో శుభ్‌మన్ గిల్ చేతికి చిక్కాడు. దీంతో కేవలం 15 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కివీస్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కివీస్ బ్యాటర్లు మైఖేల్ బ్రాస్‌వెల్, గ్లెన్ ఫిలిప్స్ క్రిజ్‌లో కుదురుకునే ప్రయత్నం చేస్తున్నారు.