The Kashmir Files: కాశ్మీర్ ఫైల్స్ జోరు.. ఆర్ఆర్ఆర్‌కు దెబ్బ పడుతుందా?

సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా మార్చి 25న థియేటర్లలలో విడుదల కానుంది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్..

The Kashmir Files: కాశ్మీర్ ఫైల్స్ జోరు.. ఆర్ఆర్ఆర్‌కు దెబ్బ పడుతుందా?

The Kashmir Files

The Kashmir Files: సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా మార్చి 25న థియేటర్లలలో విడుదల కానుంది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తుండగా.. ఇందుకోసం చిత్ర బృందం ప్రమోషన్స్ భారీగా నిర్వహిస్తుంది. మార్చ్ 25 వరకు ఆడియెన్స్ ను ఎంగేజ్ చేయడమే పనిగా పెట్టుకున్న ఈ మూవీ టీమ్.. ఇటు చూస్తే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమాకు భారీ ఆఫర్స్ ప్రకటించేసాయి. ఇంకేముంది ఆడియెన్స్ ఎదురుచూపులు.. ప్రభుత్వాల నజరానాలు ట్రిపుల్ ఆర్ కు పుష్కలంగా కలిసిరాబోతున్నాయి.

The Kashmir FIles: ”ద కశ్మీర్ ఫైల్స్’ ఆదాయాన్ని బ్రాహ్మణ కుటుంబాలకు విరాళమివ్వండి’

అయితే.. తెలుగు రాష్ట్రాలను పక్కనపెడితే దేశంలో మిగతా రాష్ట్రాలు ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో ఆర్ఆర్ఆర్ జోరుకు ఓ సినిమా బ్రేకేస్తుందా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. అదే ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా. అతి చిన్న బడ్జెట్ తో తెరకెక్కి.. భారీ కలెక్షన్లతో అందరినీ ఆశ్చర్యపరిచిన సినిమా ఇది. ఇంటెన్స్ డ్రామా ది కాశ్మీర్ ఫైల్స్ ఇప్పుడు దేశాన్ని చుట్టేస్తూ సత్తా చూపిస్తుంది. ఇప్పటికే రూ.150 కోట్లను కలెక్ట్ చేసిన ఈ సినిమా రోజు రోజుకీ దేశంలో థియేటర్లను పెంచుకుంటూ పోతూ ఈ వారం రూ.200 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ కనిపిస్తుంది.

The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’.. బడ్జెట్ 15 కోట్లు.. వారంరోజుల్లో 100 కోట్లు.. 200 కోట్లకు పరుగులు..

మార్చి 11న రిలీజైన ఈ సినిమా పదిరోజులు అంతకంతకు కలెక్షన్ల పెంచుకుంటూ పోతుండడం ఇప్పుడు బాలీవుడ్ లో మిగతా సినిమాలకు కూడా దెబ్బ పడుతుంది. మార్చి 18న రిలీజైన అక్షయ్ కుమార్ బచ్చన్ పాండే సినిమాకి కాశ్మీర్ ఫైల్స్ దెబ్బ కొట్టిందని బాలీవుడ్ ట్రేడ్స్ అంచనా. ఈ వారం రిలీజ్ కానున్న ఆర్ఆర్ఆర్ కు కాశ్మీర్ ఫైల్స్ దెబ్బపడుతుందా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. అయితే అప్పటికే కాశ్మీర్ ఫైల్స్ రెండు వారాలు పూర్తవడం.. ఆర్ఆర్ఆర్ క్రేజీ మూవీ కావడంతో కాశ్మీర్ ఫైల్స్ ప్రభావం చూపకపోవచ్చని మరో వాదన. మరి ఏమవుతుందో చూడాలంటే ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.