RRR Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ యూట్యూబ్‌లో వచ్చేసింది.. అరాచకం అనేది చిన్నపదమే!

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా తెరకెక్కుతోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినీ ప్రేక్షకులని ఊరిస్తుంది.

RRR Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ యూట్యూబ్‌లో వచ్చేసింది.. అరాచకం అనేది చిన్నపదమే!

Rrr Youtube

RRR Trailer: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా తెరకెక్కుతోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినీ ప్రేక్షకులని ఊరిస్తుంది. ఈ సినిమా నుంచి వచ్చే పోస్టర్ అయినా.. పాటైనా.. సీన్ అయినా ఏదైనా ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది. ఇప్పుడీ సినిమా నుంచి ట్రైలర్ కూడా వచ్చేసింది. ముందుగా థియేటర్లలో వచ్చిన ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో కూడా అందుబాటులోకి వచ్చేసింది.

కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్స్ అదిరిపోయాయి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మించారు. రూ.400 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ కథానాయికగా ఒలివియా మోరిస్ నటించారు. వీరితో పాటు అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రీయ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

అభిమానుల అంచనాలు ఏ మాత్రం తగ్గించకుండా ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌ను కట్ చేశారు చిత్రయూనిట్. అరాచకం అనే పదం చిన్నదే అవుతుంది అని అభిప్రాయపడుతున్నారు అభిమానులు. ఈ ట్రైలర్‌ నిడివి మూడు నిమిషాల 7సెకన్లు ఉండగా.. ట్రైలర్‌ కోసం అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు.

సంక్రాంతి కానుకగా జనవరి 7న థియేటర్లలోకి రాబోతుంది ఆర్ఆర్ఆర్. దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది.