Oats : ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఓట్స్ తింటే కలిగే ప్రయోజనాలు ఇవే!..

ఓట్స్ లో కార్బోహైడ్రేట్స్ మరియు ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి. వీటితోపాటుగా విటమిన్స్, మినరల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్లాంట్ కాంపౌండ్స్ హెచ్చుగా ఉంటాయి. ప్రాసెస్ చేయడం వల్ల ఎలాంటి ఇబ

Oats : ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఓట్స్ తింటే కలిగే ప్రయోజనాలు ఇవే!..

Oats (1)

Oats : ఇటీవలికాలంలో ఓట్స్ తినేవారి సంఖ్య బాగా పెరిగింది. ఓట్స్ ను ఆహారంగా తీసుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఓట్స్ తింటున్నారు. మరికొందరు రాత్రి సమయంలో సైతం ఓట్స్ ను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఓట్స్ తో రుచికి తగ్గట్టు వివిధ కాల పద్దతుల్లో  ఆహారంగా తయారు చేసుకుంటున్నారు.

ముఖ్యంగా ఓట్స్ ను రోజూ తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఓట్స్‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డేస్తుంది. అధిక బ‌రువు త‌గ్గేలా చూస్తుంది. షుగ‌ర్ ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది. షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు.ఓట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల ఫ్రీ ర్యాడిక‌ల్స్ న‌శిస్తాయి. క‌ణాలు సురక్షితంగా ఉంటాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

ఓట్స్ లో కార్బోహైడ్రేట్స్ మరియు ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి. వీటితోపాటుగా విటమిన్స్, మినరల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్లాంట్ కాంపౌండ్స్ హెచ్చుగా ఉంటాయి. ప్రాసెస్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, అంతేకాదు ఈజీగా ఆహారంగా తయారుచేసుకోవచ్చు. ఓట్స్ ను తీసుకోవటం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీని వల్ల తొందరగా ఆకలి వేయదు. ఓట్స్ ను రోజూ తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండు చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది.

హార్ట్ ఎటాక్ లు రాకుండా జాగ్ర‌త్త ఉండాలంటే రోజువారి ఆహారంలో ఓట్స్ ను చేర్చటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. హైబీపీ స‌మ‌స్య ఉన్న‌వారికి ఓట్స్ ఎంత‌గానో మేలు చేస్తాయి. వీటిని తిన‌డం వల్ల శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. బీపీ త‌గ్గుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు. ఓట్స్ తినడం ద్వారా మలబద్ధకాన్ని అధిగమించవచ్చు. ఓట్స్‌లో లభించే ఫైబర్ ఈ సమస్య నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.

ఓట్స్‌ను రోజూ చిన్నారుల‌కు తినిపించ‌డం వ‌ల్ల వారిలో ఆస్త‌మా అటాక్ అయ్యే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. క‌నుక ఓట్స్ ను రోజూ తిన‌డం వ‌ల్ల అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. ఓట్స్‌లో ఉండే సిలికాన్ ఆమ్లం జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.